Home » ఒకప్పటి స్టార్ హీరోయిన్ సింధు తులాని గుర్తుందా ? ఇప్పడేలా మారిపోయిందంటే ?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సింధు తులాని గుర్తుందా ? ఇప్పడేలా మారిపోయిందంటే ?

by Sravan Sunku
Ad

2003 లో “ఐతే” సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన ముంబై బ్యూటీ సింధు తులాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సింధు తులాని నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఇతర చిత్రాలలో నటించే అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన అతనొక్కడే సినిమా ద్వారా సింధుకి మంచి పేరు వచ్చింది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది సింధు.

sindhu-tolani-photos

Advertisement

అలాగే తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మను ప్రతిబింబిస్తూ తీసిన బతుకమ్మ సినిమాలో ఈమె ప్రధాన పాత్రను పోషించింది. తెలుగులో దాదాపు 30 కి పైగా సినిమాలలో నటించింది సింధు తులాని. ఈమె నెగిటివ్ షేడ్స్ ఉన్న కొన్ని క్యారెక్టర్స్ లో కూడా నటించింది. అయితే హీరోయిన్ గా కొంత కాలం పాటు బాగానే రాణించినప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంతమేర అవగాహన లోపించడం వల్ల ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలు థియేటర్ దగ్గర అనుకున్నంత హిట్ అందుకోలేదు.

Sindhu Tolani

Advertisement

దీంతో ప్రస్తుతం సింధుతులని క్యారెక్టర్ ఆర్టిస్టు లాంటి పాత్రలలో నటిస్తోంది. మొదట్లో హీరోయిన్ గా నటించిన తర్వాత ఇటీవల వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోకి వదినగా, ప్రేమ కావలి సినిమాలో, చివరిగా చిత్రాంగద అనే మూవీలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది. జూలై 19, 1983న ముంబైలో జన్మించిన సింధు తులాని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే. తండ్రి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. తల్లి ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తున్నారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక థియేటర్ కోర్సు పూర్తి చేసింది సింధు తులాని. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తిని పెంచుకుంది. తన కెరీర్ బిగినింగ్ లో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కు మోడల్ గా వ్యవహరించింది. బాలీవుడ్ లో మొహబ్బతే చిత్రంలో హీరోయిన్ గా షమిత శెట్టి ఫ్రెండ్ గా కూడా నటించింది.

 

ఆ తర్వాత “ఐతే” సినిమా ద్వారా తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. ఇక ఈమె భర్త ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు శ్వేతా అనే కుమార్తె ఉంది. అయితే పెళ్లయిన ఏడాదికే మళ్ళీ చిత్ర పరిశ్రమ లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలలో నటిస్తోంది.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading