Home » ఎన్టీఆర్ కుటుంబంలో ఎంత మంది మరణించారో తెలుసా ?

ఎన్టీఆర్ కుటుంబంలో ఎంత మంది మరణించారో తెలుసా ?

by Anji
Ad

ఎన్టీఆర్ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా తారకరత్న మరణించిన విషయం తెలిసిందే.  ఇక అంతకు ముందు నందమూరి హరికృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లారు.  అసలు ఎన్టీఆర్ సంతానంలో ఎంత మంది ఉన్నారు. ఎంత మంది మరణించారు అనేది నందమూరి అభిమానులు చర్చలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. 

 

Advertisement

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ చిన్న వయస్సులోనే ఓ అరుదైన వ్యాధితో కన్నుమూశాడు. రామకృష్ణ చనిపోయిన సమయంలో ఇరుగు పొరుగు షూటింగ్ లో ఉన్నారు ఎన్టీఆర్. ఈ విషయం తెలిసినప్పటికీ ఆయన మాత్రం షూటింగ్ పూర్తి చేసే ఇంటికి వచ్చారట. రామకృష్ణ మరణించిన విషయం జీర్ణించుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. 

ఆ తరువాత ఎన్టీఆర్ ఐదో కొడుకు సాయికృష్ణ కూడా కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు. ఈ ఫొటోలో వరుసలో నాలుగో వ్యక్తి. ఈయన ఎన్టీఆర్ కి సంబంధించిన పర్సనల్ విషయాలను చూసుకునేవారు. 

ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ తనయుడిగా సినీ రంగంతో పాటు రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ఉనికినీ చాటుకున్నాడు. సినీ రంగంలో చేసింది.కొన్ని సినిమాలే అయినప్పటికీ సీతయ్య సినిమా చాలా ఫేమస్ అయింది. 2018 ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Advertisement

ఎన్టీఆర్ కి నలుగురు కూతుర్లు. పెద్ద కూతురు పేరు గారపాటి లోకేశ్వరి, రెండో కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి, మూడో కూతురు నారా భువనేశ్వరి, నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి. ఇటీవల ఈమె మరణించింది. ఎన్టీఆర్ కి 12 సంతానంలో 8 మంది మగపిల్లలు, 4 ఆడపిల్లలు. వీరిలో ముగ్గురు కుమారులు రామకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ కన్ను మూశారు. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడే రామకృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఉమామహేశ్వరి మరణించడంతో మొత్తం నలుగురు సంతానం ఈ లోకాన్ని విడిచిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సంతానంలో ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. 

ఎన్టీఆర్ మిగతా కుటుంబ సభ్యుల విషయానికి వస్తే.. హరికృష్ణకి పుత్రశ్లోక తప్పలేదు. ఆయన పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విచిత్రం ఏంటంటే. అతను చనిపోయిన నాలుగేళ్లకు హరికృష్ణ కూడా అదే యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎన్టీఆర్ మనవరాలు కూడా ఓ సీనియర్ నిర్మాత ఇంటికి కోడలు గా వెళ్లి అప్పట్లో ఆ**త్య చేసుకొని మరణించడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా తారకరత్న  కూడా మరణించిన విషయం తెలిసిందే. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎన్టీఆర్ కుటుంబంతో వడ్డే నవీన్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

 ఫస్ట్ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సినీ ప్రముఖులు వీరే..!

యువరాణి పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు…!

Visitors Are Also Reading