Telugu News » Blog » Actress Gajala: గజాల అప్పుడు అలా ఎందుకు చేసింది? ఆ హీరో నేనా కార‌ణం..?

Actress Gajala: గజాల అప్పుడు అలా ఎందుకు చేసింది? ఆ హీరో నేనా కార‌ణం..?

by Anji
Ads

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి పరిచ‌యం అయిన న‌టుల‌లో గ‌జాల ఒక‌రు. ఆమె చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ తెలుగులో చాలా మంచి పేరు తెచ్చుకున్న‌ది. 2001లో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి సినిమా స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ తో త‌న స‌త్తాను చాటింది. ఇక ఆమె తొలి సినిమా నాలో ఉన్న ప్రేమ. జ‌గ‌ప‌తి బాబుతో క‌లిసి న‌టించింది. ఇక ఆ తరువాత ఉద‌య్‌కిర‌ణ్‌తో క‌లుసుకోవాల‌ని, శ్రీ‌కాంత్‌తో ఓ చిన‌దాన‌, ఎన్టీఆర్‌తో అల్ల‌రి రాముడు, వేణుతో తొట్టిగ్యాంగ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. త‌న అందంతో పాటు న‌ట‌న‌లో కూడా ఎంతో ప్ర‌తిభ చూపించిన గ‌జాల ఆ త‌రువాత సినీ ప‌రిశ్ర‌మ‌కు మెల్ల‌మెల్ల‌గా దూర‌మైంది.


తెలుగు హీరోయిన్లు ఎక్కువ కాలం ఉండ‌రు అని, కొత్త వారికి అవ‌కాశాలు వ‌స్తూనే ఉంటాయి. పాత‌వారు తెర‌మ‌రుగు కావ‌డం తెలిసిన‌దే. గజాల మాత్రం మిన‌హాయింపు కాదు క‌దా.. త‌న‌ను ఓ హీరో మోసం చేశాడ‌ని 2002 జులై 22న హైద‌రాబాద్‌లో ప్ర‌శాంత్ కుటీర్ రెస్ట్ హౌస్‌లో నిద్ర‌మాత్ర‌లు మింగింది. యాక్ష‌న్ హీరో అర్జున్‌కు ఫోన్ చేసి ఇక నేను మీకు క‌నిపించ‌న‌ని చెప్ప‌డంతో ఆయ‌న హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించడంతో ప్రాణాపాయం త‌ప్పినట్టు అయింది. అప్ప‌ట్లో అర్జునే కార‌ణంగానే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌నే వాన‌ద‌లు కూడా వినిపించాయి. అర్జున్ మాత్రం వాటిని ఖండించారు. మాన‌వ‌తా దృక్ప‌థంతో సాయం చేశాన‌ని.. నాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.


1985 మే 19న గ‌జాల ముంబైలో జ‌న్మించింది. త‌ల్లిదండ్రులు మాత్రం దుబాయ్‌లో ఉంటారు. ఆమె న‌ట‌న‌తో ఆస‌క్తితో ఇక్క‌డే ఉండి సినిమాల్లో న‌టించింది. అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో జీవితంపై విర‌క్తితో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఇక ముంబై వెళ్లి టీవీ న‌టుడు ఫైజ‌ల్ రాజాఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్ద‌రూ క‌లిసి సీరియ‌ళ్ల‌లో న‌టిస్తున్నారు. అస‌లు గ‌జాల అలా ఎందుకు చేసింది. ఎవ‌రు ఆ హీరో అంటే మాత్రం స‌మాధానం లేదు. గ‌జాలు ర‌క్షించినందుకు అర్జున్‌పై మాత్రం కొన్ని కామెంట్లు వినిపించాయి. ఆయన వ‌ల్లే గ‌జాల ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించింద‌నే టాక్ వినిపించింది. అయిన‌ప్ప‌టికీ ఆమెను మోసం చేసిన హీరో ఇప్ప‌టికీ ఎవ‌రు అనేది మా్రం మిస్ట‌రీగానే ఉండిపోయింది. గజాల అప్ప‌టి నుంచి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌దిలి వెళ్లిపోయి ముంబైలో స్థిర‌ప‌డింది.

Also Read : 

బయోపిక్ కు డబ్బులు ఇస్తామన్న “మేజర్” నిర్మాతలు….సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఏమన్నారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..!

 


You may also like