Home » జైలర్ మూవీకి రజినీకాంత్ తో పాటు వారు అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా ?

జైలర్ మూవీకి రజినీకాంత్ తో పాటు వారు అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా ?

by Anji
Ad

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఆగస్టు 10న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్ మూవీపై మంచి అంచనాలు పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం రజినీకాంత్, మోహన్ లాల్, సహా ఇతర ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేనప్పటికీ రజినీకాంత్  ఈ మూవీ కోసం రూ.110కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. 

Advertisement

ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ చేసిన మోహన్ లాల్ రూ.8కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లకి రూ.4కోట్ల రెమ్యునరేషన్ అందించినట్టు సమాచారం. రజినీకాంత్ కి జోడీగా నటించిన రమ్యకృష్ణ రూ.80లక్షల పారితోషికం అందుకుంది. సునీల్ కి రూ.60లక్షల వరకు అందినట్టు సమాచారం. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించిన తమన్నాకి ఏకంగా రూ.3కోట్లు ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. కమెడీయన్ యోగిబాబుకి రూ.1కోటి కాగా.. ఇతర ఆర్టిస్ట్స్ టెక్నిషియన్స్ కి కలిపి సుమారు 5, 6 కోట్లు అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

మొత్తానికి జైలర్ సినిమా రెమ్యునరేషన్ కే రూ.140 నుంచి రూ.150 కోట్ల రూపాయల వరకు అయిందని టాక్ వినిపిస్తోంది.  ఆగస్టు 10 రిలీజ్ కానున్న ఈ మూవీ చిరంజీవి భోళా శంకర్ కి గట్టి పోటీ ఇచ్చేవిధంగా ఉందంటున్నారు నెటిజన్లు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని సూపర్ స్టార్ కి జైలర్ మూవీ హిట్ అవ్వడం కీలకం మారింది. అనిరుధ్ అందించిన మ్యూజిక్ ట్రైలర్ ప్లస్ అవ్వడమే కాకుండా సినిమా పై అంచనాలను కూడా అమాంతం పెంచేసింది. పాజిటివ్ వైబ్స్ తో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ మూవీ రజినీకాంత్ కి బ్లాక్ బస్టర్ ఇస్తుందో లేదో వేచి చూడాలి మరీ.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

సూపర్ స్టార్ కృష్ణ క్లాస్మెట్స్ ఇండస్ట్రీలో ఎంత ఉన్నారో తెలుసా ? 

విజయేంద్ర ప్రసాద్ అప్పుడు చెప్పినట్టుగానే సముద్రఖని బ్రో మూవీ ద్వారా నిజం చేశాడా ?

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

Visitors Are Also Reading