Home » సూపర్ స్టార్ కృష్ణ క్లాస్మెట్స్ ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నారో తెలుసా ? 

సూపర్ స్టార్ కృష్ణ క్లాస్మెట్స్ ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నారో తెలుసా ? 

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బుర్రిపాలెం బుల్లోడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. ఆయన సినిమాలు అప్పట్లో ఎంతటి రికార్డు సాధించాయో అందరికీ తెలిసిందే. సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజులు అప్పట్లో సినిమాలను పోటాపోటీగా తీసేవారు. కృష్ణ తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు. ఇప్పుడు ఆయన మన ముందు లేరు. కానీ ఇండస్ట్రీలో ఆయన క్లాస్మెట్స్, బెంచ్ మెట్స్ చాలా మంది ఉన్నారట. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మురళీ మోహన్ 

మురళీ మోహన్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈయన అప్పట్లో చాలా సినిమాలను తీశాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మా అధ్యక్షుడిగా, రాజకీయాల్లో కూడా రాణించారు. అయితే మురళీ మోహన్, కృష్ణ  క్లాస్మెట్స్. వీరిద్దరూ ఇంటర్మీడియట్ లో ఒకే బెంచ్ లో కూర్చునేవారట. వీరు చదువులో అంతగా రాణించకపోయినా స్నేహాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో ఇద్దరూ రాణించారు. 

విజయేంద్ర ప్రసాద్ 

Advertisement

విజయేంద్ర ప్రసాద్ అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉండవచ్చు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అంటే దాదాపు తెలియని వారుండరు. రాజమౌళి తెరకెక్కించే అన్ని సినిమాలకు దాదాపు విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. ఓవైపు రచయితగా కొనసాగుతూనే మరోవైపు దర్శకత్వ బాధ్యతలను కూడా భుజాలపై వేసుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన రాజన్న మూవీకి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు. కృష్ణ, విజయేందర ప్రసాద్ ఇద్దరూ క్లాస్మెట్స్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 

క్రాంతి కుమార్ 

క్రాంతి కుమార్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా రాణించారు. అయితే 2003లో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. క్రాంతి కుమార్ దర్శకత్వంలో సీతారామయ్యగారి మనవరాలు మూవీ తెరకెక్కింది. చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. మురళీ మోహన్, కృష్ణ, విజయేంద్రప్రసాద్, క్రాంతి కుమార్ ఒకే క్లాస్మెట్స్, ఒకే బ్యాచ్ మెంట్ గా ఉండి ఇండస్ట్రీలో కూడా స్టార్లుగా ఎదిగారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు

విజయేంద్ర ప్రసాద్ అప్పుడు చెప్పినట్టుగానే సముద్రఖని బ్రో మూవీ ద్వారా నిజం చేశాడా ?

ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!

Visitors Are Also Reading