Home » సలార్ టీజర్ లో కనిపించిన ఈ వ్యక్తి ఎవరు..?

సలార్ టీజర్ లో కనిపించిన ఈ వ్యక్తి ఎవరు..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా కేజీఎఫ్  వంటి హిట్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూవీ సలార్. ఇవాళ ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఉదయం 5.12 గంటలకే విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవైటేడ్ సినిమాల్లో సలార్ ఒకటి. ఈ మూవీపై ప్రేక్షకుల్లో.. ప్రభాస్ అభిమానుల్లో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.  సెప్టెంబర్ 28న ఫస్ట్ పార్ట్ ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్ లో టైగర్, చీతా, ఎలిఫెంట్ కంటే వెరీ డేంజరస్ అంటూ హీరో క్యారెక్టర్ ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా..? అతని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

సలార్ మూవీ టీజర్ లో అతని పైకి గన్స్ ఎక్కు పెట్టి విలన్స్ వచ్చిన సమయంలో ప్రభాస్ గురించి డైలాగ్ చెబుతాడు. ఆ వ్యక్తి పేరు టినూ ఆనంద్.   ఇతను రచయిత, దర్శకుడు. ఈయన అసలు పేరు వీరేందర్ రాజ్ ఆనంద్. ఇతని తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ అతను కూడా ప్రముఖ సినీ రచయితనే. సోదరుడు బిట్టు ఆనంద్ సినీ నిర్మాత. కొన్ని బెంగాలీ సినిమాలకు సత్యజిత్ రాయ్ కి సహాయకుడిగా వ్యవహరించాడు. టిన్ ఆనంద్ తండ్రి ఇందర్ రాజ్ ఆనంద్ కి తొలుత తన పిల్లలను సినీ పరిశ్రమలోకి రావడానికి ఇష్టం లేదట. కానీ టినూకు ఉన్న ఆసక్తిని గమనించి అప్పటికే పరిచయమున్న తన స్నేహితుడు సత్యజిత్ రాయ్ దగ్గరికి పంపించాడు. 

Advertisement

ఆ తరువాత టాలీవుడ్ లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన  ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ లో టైమ్ మిషిన్  సృష్టించే శాస్త్రవేత్త పాత్రలో అద్భుతంగా నటించాడు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆత్మలింగాన్ని సాధించి అమరుడు కావడానికి ప్రయత్నించే ప్రతీనాయకుడుగా నటించాడు. అలాగే ఎస్వీ  కృష్ణారెడ్డి దర్శకత్వంలో మరో సైన్స్ ఫిక్షన్ సినిమా ఘటోత్కచుడు సినిమాలో రోబో శాస్త్రవేత్త పాత్రను పోషించాడు. అలాగే కేజీఎఫ్ మూవీలో కూడా నటించాడు టినూ ఆనంద్. సలార్ మూవీ టీజర్ లో ప్రభాస్ ని పరిచయం చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రజినీకాంత్ తరువాత అల్లు అర్జునే.. ఆ టాలీవుడ్ నటుడు ఏమన్నాడంటే..?

నిహారిక కంటే ముందే విడాకులు తీసుకున్న సినీ స్టార్స్ వీరే..!

 

Visitors Are Also Reading