సూపర్ స్టార్ రజినీకాంత్ కాంత్ కి భారతదేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం అయితే పాన్ ఇండియా సినిమాల పేరుతో దర్శకులు, నిర్మాతలు సినిమాల గ్రాండియర్ పెంచుతూ అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. కానీ రజినీకాంత్ సినిమాలు కేవలం తమిళంలోనే సినిమాలు తీసేవాడు. ఇక ఆ సినిమాలే మిగతా భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. కానీ ఆయన స్టైల్, ఆయనకు ఉన్న చరిష్మా, ఆఫ్ స్క్రీన్ లో ఆయన అందరితో నడుచుకునే విధానం ఆయనను ఇవాళ సూపర్ స్టార్ ని చేసింది. అంతటి పేరు ఉన్న వ్యక్తితో అల్లు అర్జున్ ని కంపెర్ చేశాడు ఓ టాలీవుడ్ నటుడు.
Advertisement
అతను మరెవ్వరో కాదండోయ్ శివాజీ. ఒకప్పుడు తెలుగులో మంచి సినిమాలను చేస్తూ చాలా బిజీగా ఉండేవాడు. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఈయనను ఇండస్ట్రీ దూరం పెట్టిందా..? లేకఈ హీరోనే కావాలనే దూరమయ్యాడో.. రెండు కాకుండా అవకాశాలు రావడం లేదో తెలియదు. ప్రస్తుతం శివాజీ సినిమాలను చేయడం లేదు. మధ్య మధ్యలో మీడియా ముందుకు మెరుపు తీగలా వచ్చి ఏవేవో సంచలన వ్యాఖ్యలు చేసి హడావుడి చేశాడు. ఇప్పుడు ఈయన కూడా చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఇటీవలే ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన హీరో శివాజీ యాంకర్ మీ ఫెవరేట్ హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు తాను ఎప్పటికీ చిరంజీవి అభిమానిని అని చెబుతూనే ఈ జెనరేషన్ లో తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నాడు. అదేవిధంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత ఆ ప్లేస్ అల్లు అర్జున్ కే సొంతమని చెప్పడంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ కి సపోర్టు చేస్తున్నారు. వేరే హీరోలా అభిమానులు మాత్రం నీకు చిఫ్ నిజంగానే దొబ్బింది భయ్యా.. అల్లు అర్జున్ కంటే స్టార్ డమ్ ఉన్న హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నీకు కనబడటం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పవన్ కళ్యాణ్ నుంచి నిహారిక వరకు.. మెగాఫ్యామిలీలో కులాంతర వివాహాలు చేసుకుంది వీరే!