Home » ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి తెర వెనుక ఉన్న‌దెవ్వ‌రు..? బీజేపీ ఇచ్చిన హింట్ అదేనా..?

ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి తెర వెనుక ఉన్న‌దెవ్వ‌రు..? బీజేపీ ఇచ్చిన హింట్ అదేనా..?

by Anji
Ad

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వారికి లాభం లేకుండా ఎప్పుడూ ఎవ్వ‌రినీ క‌ల‌వ‌రు అని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవ‌ల కామెంట్స్ చేశారు. ఇటీవ‌ల తెలంగాణలోని న‌ల్ల‌గొండ‌ జిల్లాలో మునుగోడుకి అమిత్ షా విచ్చేసిన విష‌యం తెలిసింది. ఇక ఆ సంద‌ర్భంలోనే హైద‌రాబాద్ లో టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రైన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని పిలిచి మ‌రీ ఓ హోట‌ల్‌లో క‌లిశారు అమిత్ షా. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న మెచ్చి పిలిచి అభినందిచార‌ని ప్ర‌చారం కొన‌సాగుతుండ‌గా.. వాస్త‌వానికి ఆర్ఆర్ఆర్ సినిమా క్రెడిట్ అంతా రామ్‌చ‌ర‌ణ్ ఎగురేసుకుపోయాడ‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి.

ఇవి కూడా చదవండి:  చిరంజీవి న‌టించిన సినిమాల్లో బాల‌య్య‌కు చాలా ఇష్ట‌మైన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?

Advertisement

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను మెచ్చుకోవాలంటే తొలుత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళినే పిల‌వాలి. ఆ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్‌ని పిల‌వాలి. వీరిద్ద‌రినీ కాద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని పిల‌వ‌డంతో ఎన్టీఆర్ కుటుంబం రాజ‌కీయ కుటుంబం కావ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం అని తెలుస్తోంది. మ‌రో ప్ర‌చారం కూడా వినిపిస్తుంది. అదే ర‌జాకార్ ఫైల్స్. ర‌జాకార్ ఫైల్స్ తో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఓ క‌థ‌ను రాయ‌బోతున్నాడు. ఇక త్వ‌ర‌లోనే సినిమాని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ సినిమా గురించి చ‌ర్చించేందుకు అమిత్ షా ఎన్టీఆర్‌ని పిలిచార‌ట‌. ఆ సినిమాలో న‌టించ‌డానికి ఆఫ‌ర్ ఇచ్చార‌న్న‌ది ప్ర‌చారం. అమిత్ షా పిలిపించుకుని మ‌రీ చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఒక్క‌మాట చెప్పినా స‌రిపోతుంది.

ఇవి కూడా చదవండి: ఎంత సంపాదించినా మిమ్మ‌ల్ని ద‌రిద్రం వెంటాడుతుందా..? అయితే ఈ 3 అల‌వాట్లు త‌ప్ప‌క మానుకోండి..!


అమిత్ షా- ఎన్టీఆర్ భేటీపై సోష‌ల్ మీడియాలో చాలా మంది చాలా ర‌కాల వార్త‌ల‌ను పోస్ట్ చేస్తున్నారు. కానీ వీరిద్ద‌రి మ‌ధ్య తెర‌వెనుక ఉండి న‌డిపించింది ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు. ఆయ‌న ఆదేశాల‌తో రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ వీరిద్ద‌రి భేటీని ఏర్పాటు చేయించారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కి ఈ మ‌ధ్యనే రాజ్య‌స‌భ ఎంపీగా ప్ర‌మోష‌న్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. నేరుగా రామోజీరావు ఫోన్ చేసి ఎన్టీఆర్‌కి చెబితే ఒప్పుకోక‌పోవ‌చ్చు. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌, సింహాద్రి, య‌మ‌దొంగ‌, ఆర్ఆర్ఆర్ వంటి సూప‌ర్ హిట్‌లు అందించిన రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెబితే ఒప్పుకుంటార‌న్న న‌మ్మ‌కంతో ఆదిశ‌గా రామోజీరావు న‌డుపుకొచ్చారు. ఒక్క‌సారి క‌ల‌వండి. ఆయ‌న కోరుతున్నారు. రాజ‌కీయ అంశాలు ఏవి కాద‌ట‌. జ‌స్ట్ ముఖ ప‌రిచ‌యం, అభినంద‌న‌లు మాత్ర‌మే ఉంటాయని విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పిన త‌రువాత‌నే ఎన్టీఆర్ ఆ భేటికి ఒప్పుకున్నారు.

ఎన్టీఆర్‌- అమిత్ షా భేటీలో రాజ‌కీయ అంశాలు ఏమి రాలేదు. ఎలా ఉన్నారు..? ఫ్యామిలీ ఎలా ఉంది..? ఏయే సినిమాల్లో న‌టించారు. ఇక అప్పుడ‌ప్పుడూ క‌లుస్తూ ఉండండి. మీ న‌ట‌న బాగుంది. మీ తాత గారి గురించి మేము చాలా విన్నాం. చాలా సినిమాలు చూశాం. రాజ‌కీయాల్లో ఆయ‌న సృష్టించిన ప్ర‌భంజ‌నం గురించి మాకు తెలుసు. ఆయ‌న‌లా మీరు కూడా ఎద‌గాల‌ని ఆశిస్తున్నాను. మంచి సినిమాలు తీయండి. మీకు ఎలాంటి స‌హాయం కావాల‌న్నా మేము అండ‌గా ఉంటామ‌నే విష‌యాల‌ను ఎన్టీఆర్‌కి అమిత్ షా చెప్పార‌ని స‌మాచారం. నేరుగా రాజ‌కీయ అంశాల‌పై వారిద్ద‌రూ చ‌ర్చ‌కు రారు. క‌లిసిన మొట్ట‌మొద‌టి సారే టీడీపీని నీ చేతిలోకి తీసుకో.. నిన్ను ఏపీ సీఎంని చేస్తామ‌ని ఆఫ‌ర్లు ఇచ్చేంత పిచ్చోడు ఏం కాదు అమిత్ షా. ఆయ‌న ప్ర‌తి క‌ద‌లిక వెనుక ఓ వ్యూహం దాగి ఉంటుంది.

Advertisement

ప్ర‌స్తుతం ఒక భేటీ జ‌రిగిందంటే.. దాని ఫ‌లితాలు కొన్నాళ్ల త‌రువాత‌.. కాదు కాదు.. కొన్నేళ్ల త‌రువాత భ‌య‌ట‌ప‌డ్డాయి. ఎన్టీఆర్ తో భేటీ అనేది భ‌విష్య‌త్‌లో బీజేపీ ప్ర‌యోజ‌నాల కోస‌మే అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. సినీ ఇండ‌స్ట్రీలో ఇంత మంది ఉన్న‌ప్ప‌టికీ ఏ హీరోని పిలువ‌కుండా కేవ‌లం ఒక్క ఎన్టీఆర్ నే ఎందుకు పిలిచార‌న్న‌దే ఇప్పుడు అంద‌రినీ వేదిస్తున్న ప్ర‌శ్న‌. మిగ‌తా వారిని పిలిస్తే లాభం ఏం ఉండ‌దు. కానీ ఎన్టీఆర్‌ని పిలిస్తేనే లాభం ఉంటుంద‌ని లెక్క‌లు వేసి ఉండ‌వ‌చ్చు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కి సీనియ‌ర్ ఎన్టీఆర్ పోలిక‌లున్నాయి. ఆ పెద్దాయ‌న‌నే ఈ ఎన్టీఆర్ రూపంలో వ‌చ్చార‌ని నంద‌మూరి అభిమానులు భావిస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఏ రంగంలోనైనా సీనియ‌ర్ ఎన్టీఆర్‌లా వ్య‌వ‌హ‌రిస్తారు. బీజేపీ త‌రువాత టార్గెట్ తెలుగు రాష్ట్రాలు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ‌లో కేసీఆర్‌ని ఓడించాల‌న్న‌ది అమిత్ షా టార్గెట్‌. ఇక ఈ టార్గెట్‌ని ఛేదించాలంటే అన్ని శ‌క్తుల‌ను ఏకం చేస్తేనే రీచ్ అవ్వ‌వ‌వ‌చ్చ‌ని అమిత్ షా ప్లాన్‌.

ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోకూడ‌ద‌ని బీజేపీ ప్లాన్‌. అయితే హైద‌రాబాద్‌లో సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. వారిలో క‌మ్మారి ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. హైద‌రాబాద్ మాత్ర‌మే కాదు.. ఉమ్మ‌డి న‌ల్గొండ‌, ఖ‌మ్మం వంటి జిల్లాల్లో సీమాంద్రుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. క‌మ్మ వారు ఎక్కువ‌. తెలుగుదేశం పార్టీ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. తెలంగాణ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు టీడీపీ హ‌యాంలోనే జ‌రిగాయి. 2024లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఓకే. ఇక ఆ త‌రువాత ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకి వ‌య‌స్సు మీద ప‌డుతుంది. లోకేశ్ అన్నీ తానై న‌డిపించాల్సి ఉంటుంది. ఇక ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం అనేది లోకేశ్ వ‌ల్ల అవుతుందా..? కాదా అన్న సంగ‌తి ప‌క్క‌కు పెడితే జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి టీడీపీ అండ‌గ ఉండ‌క‌పోతే భ‌విష్య‌త్లో టీడీపీ అనేది క‌నుమ‌రుగ‌వుతుంది. చంద్ర‌బాబు రాజ‌కీయాల్లో ఉన్నంత కాలం జూనియ‌ర్ కూడా సైలెంట్‌గా ఉంటాడు.

 


టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి మేర‌కు ఎన్టీఆర్ టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్ట‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ అదే ఆలోచిస్తున్నారు. ఇక ఆ విష‌యంపై ఆ విష‌యం పై రామోజీరావుకు కూడ ఆ ఓ క్లారిటీ ఉంది. ముందే ఎన్టీఆర్‌తో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తే భ‌విష్య‌త్‌లో త‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతాడ‌న్న‌ది బీజేపీ ఆలోచ‌న కావ‌చ్చు. సీమాంధ్రుల ఓట్లు, టీడీపీ సానుభూతి ప‌రుల ఓట్లు రేవంత్‌రెడ్డి వైపు మ‌ళ్ల‌కుండా బీజేపీ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నంలో భాగంగానే అమిత్ షా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని క‌లిసి ఉండ‌వ‌చ్చ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేకుల అంచ‌నా. ఇక 2024లో తెలంగాణ‌లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్ తో ప్ర‌చారం చేయించాల‌ని అమిత్ షా భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అందుకే ఈ అంశంపై టీడీపీ నేత‌లు ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ఇటీవ‌ల సినీ హీరోలు ఏపీ సీఎం జ‌గ‌న్‌ను భేటీ అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ మాత్రం వెళ్ల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇవి కూడా చ‌ద‌వండి :  బంగ్లా వేదిక వుమెన్స్ ఆసియా కప్.. ఈ టోర్నీ చరిత్ర తెలుసా మీకు..?

Visitors Are Also Reading