Home » ఎంత సంపాదించినా మిమ్మ‌ల్ని ద‌రిద్రం వెంటాడుతుందా..? అయితే ఈ 3 అల‌వాట్లు త‌ప్ప‌క మానుకోండి..!

ఎంత సంపాదించినా మిమ్మ‌ల్ని ద‌రిద్రం వెంటాడుతుందా..? అయితే ఈ 3 అల‌వాట్లు త‌ప్ప‌క మానుకోండి..!

by Anji
Ad

సాధార‌ణంగా ప్ర‌తీ ఒక్క‌రు వారి జీవితంలో అనుకున్న కోరిక‌లు నెర‌వేరాల‌ని ఎంతో సుఖ‌, సంతోషాల‌తో ఉండాల‌ని భావిస్తుంటారు. ఇలా సంతోషంగా ఉండ‌డం కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డి డ‌బ్బు సంపాదిస్తారు. ఇలా డ‌బ్బు సంపాదించి వారి క‌ల‌లు నెర‌వేర్చుకోవాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా కానీ వారి క‌ల‌లు మాత్రం ఓ క‌ల‌గానే మిగిలిపోతుంటాయి. ఎందుకంటే కొంద‌రు ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గ‌వ్వ కూడా నిల‌వ‌దు. ఇలా సంపాదిచిన ఒక్క రూపాయి కూడా మ‌న ద‌గ్గ‌ర ఉండ‌క‌పోతే అందుకు గ‌ల కార‌ణం మ‌న అల‌వాటే అని చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు ఆ అల‌వాటు ఏంటో తెలుసుకుందాం.

Advertisement

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు మ‌నం చాలా మంది కొబ్బ‌రికాయ కొట్టేది చూస్తుంటాం. ఈ కొబ్బ‌రికాయ కొట్టే స‌మ్యంలో కొబ్బ‌రికాయ పై కుంకుమ బొట్లు పెట్టి దేవుడికి కొడ‌తారు. ఇలా కుంకుమ పెట్టి కొబ్బ‌రికాయ కొట్ట‌డం వ‌ల్ల మ‌నం కోరుకున్న కోరిక‌లు నెర‌వేర‌డం ఏమో కానీ అష్ట‌ద‌రిద్రాలు మ‌న‌ల్ని వెంటాడుతాయి. అందుకే టెంకాయ కొట్టేట‌ప్పుడు కుంకుమ అస్స‌లు పెట్ట‌కూడ‌దు. అలాగే మ‌న ఇంట్లో ఎప్ప‌టి నుంచో మ‌న పెద్ద‌లు ఉప‌యోగించిన వ‌స్తువుల‌ను మ‌నం వాడుతుంటాం. అయితే అక‌స్మాత్తుగా మ‌న‌కు ఏదైనా చెడు జ‌రిగితే ఆ వ‌స్తువుల వ‌ల్ల చెడు జ‌రిగిందని.. ఈ ప‌ద్ద‌తులు పాటించ‌డం వ‌ల్ల చెడు జరిగింద‌ని భావిస్తారు. ఇక ఈ అల‌వాటు కూడా ద‌రిద్రానికి సంకేత‌మనే చెప్పాలి.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  ఈ ‘టీ’ ని ప్ర‌తిరోజూ తాగితే గ్యాస్ స‌మ‌స్యే ఉండ‌దు.. తెలుసా..?

ఇక‌పోతే చాలా మంది కుర్చీలో కూర్చున్న స‌మ‌యంలో కాల్లు ఊపుతూ కూర్చుంటారు. ఈ అల‌వాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఇలా కాళ్లు ఊపుతూ కూర్చొవ‌డం కూడా చెడుకు సంకేత‌మ‌ట‌. ఎప్పుడూ కూడా కాళ్లు ఊపుతూ కాలిపై కాలు వేసుకొని కూర్చోవ‌డం మంచిది కాద‌ని పండితులు పేర్కొంటున్నారు. మ‌నం కుర్చీలో కూర్చున్న‌ప్పుడు రెండు కాళ్లు నేల‌కు తాకేలా ఉండాలి. ఈ అల‌వాట్ల‌ను క‌నుక మానుకుంటే మ‌న జీవితంలో ఉన్న ద‌రిద్రం తొలిగిపోతుంద‌ని పండితులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి : ఈ హై ప్రోటీన్ స‌లాడ్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మీరు రోజంతా ఎన‌ర్జిటిక్‌గా ఉండ‌డం ప‌క్కా..!

Visitors Are Also Reading