Home » ఎవరు ఈ ఓం రౌత్..? ప్రభాస్ తో ఇతని కలిపింది ఎవరు..?

ఎవరు ఈ ఓం రౌత్..? ప్రభాస్ తో ఇతని కలిపింది ఎవరు..?

by Mounika
Ad

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ ఈ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్ నటనకు థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముగ్దలవుతున్నారు. ఈ చిత్రంలోని అద్భుతమైన విజువల్స్ మరియు సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లను సైతం దేవాలయాలు తలపించేలా మార్చేశారు థియేటర్ ఓనర్స్. గతేడాది టీజర్ రిలీజ్ టైంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ చిత్రంలో రిలీజ్ కి ముందు సినీ అభిమానులలో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది.

om raut

Advertisement

ఇక సినిమా విడుదలైన తర్వాత నార్త్, సౌత్ తేడా లేకుండా సినీ అభిమానులను రామభక్తిలో ముంచేసింది. ఇంత అద్భుతంగా చిత్రాన్ని ఈ తరానికి అర్థమయ్యే విధంగా మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించారు ఓం రౌత్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంతో ఓం రౌత్ ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలోని ఇదే సందేహం.. ఎవరు ఈ ఓం రౌత్..? ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ వెతుకులాట మొదలైంది.

ఓం రౌత్ ముంబయిలో జన్మించారు. ఆయన తల్లి నీనా టెలివిజన్ నిర్మాత. తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్ మరియు రాజ్యసభ సభ్యుడు. ఇక ఓం రౌత్ తాత కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. అలా ఓం రౌత్ కి సినిమాలంటే ఫ్యాషన్ ఏర్పడింది. ఆయన చిన్న వయసులో బాల నటుడిగా పని చేశాడు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే కథానాయకుడిగా కారమతి కోట్ అనే సినిమా నటించారు. మరాఠీ భాషలో లోకమాన్య ఏక్ యుగ్ పురుష్ అనేది ఆయన తీసిన మొదటి సినిమా. ఓం రౌత్ తీసిన తానాజీ చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

Advertisement

 

 

ఇకపోతే టి సిరీస్ సంస్థతో ప్రభాస్ కు మంచి అనుబంధం వుంది. సాహో, రాధే శ్యామ్ సినిమాల సమయంలో వారి సంస్థతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారట ప్రభాస్. అప్పటికే అదే సంస్థలో ఉన్న ఓం రౌత్.. 1992లో జపానికి చెందిన రామాయణ: ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ అనే హిందూ పురాణ కథ ఆధారంగా నిర్మించిన సినిమా ఓం రౌత్ ని బాగా ఆకట్టుకుంది . ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి ఆధునిక సాంకేతిక సాయంతో రామాయణం కథను ఎందుకు తీయకూడదు అనే ఆలోచన రావటంతో అదే విషయాన్ని టి సిరీస్ సంస్థ ప్రతినిదులకు ఓం రౌత్ చెప్పడం జరిగిందట. అలా ఆదిపురుష్ చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత టీ సిరీస్ వల్ల అతనికి ప్రభాస్ కి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటికే ఓం రౌత్ మూడు సినిమాలు చేశాడు. ఆ సినిమాలు అన్ని విజయం సాధించడంతో ప్రభాస్ టీ సిరీస్ సంస్థకి ఇచ్చిన మాట ప్రకారం ఆదిపురుష్ సినిమాకు ఓకే చేశారట.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

అలనాటి ఈటీవీ సీరియల్స్ హీరోయిన్స్ గుర్తున్నారా..! వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

“పుష్ప 2 ” సీక్వెల్ లో ఇంటరెస్టింగ్ సీన్.. ట్విస్ట్ అదిరిందిగా!

ఆదిపురుష్ సినిమా రివ్యూ ఇచ్చిన వ్యక్తిని థియేటర్ వద్దే చితక్కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

Visitors Are Also Reading