Home » ఆదిపురుష్ సినిమా రివ్యూ ఇచ్చిన వ్యక్తిని థియేటర్ వద్దే చితక్కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

ఆదిపురుష్ సినిమా రివ్యూ ఇచ్చిన వ్యక్తిని థియేటర్ వద్దే చితక్కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

by Srilakshmi Bharathi
Ad

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ఆదిపురుష్. ఇప్పుడు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చాలా గ్రాండ్ గా తీసారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఆదిపురుష్ సినిమాలో… సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటించగా రామయ్య పాత్రలో ప్రభాస్ అలరించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.

adipurush review fight

Advertisement

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆదిపురుష్ మానియా కనిపిస్తోంది. అయితే ఈరోజు సినిమా విడుదల అయ్యి తొలిరోజు కావడంతో ఏ థియేటర్లో చూసిన రివ్యూ ల హంగామా నడుస్తోంది. సినిమా చూసిన బయటకు వచ్చిన వాళ్ళు ముందుగా తాము రివ్యూ చెప్పాలి అని హడావిడి పడుతున్నారు. మీడియా ముందుకు వచ్చి రివ్యూ చెప్పడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

adipurush review fight

Advertisement

ఈ క్రమంలో ప్రసాద్స్ లో రివ్యూ చెప్పిన ఓ వ్యక్తిని ప్రభాస్ ఫ్యాన్స్ చితకొట్టేశారు. సదరు వ్యక్తి తనకు సినిమా నచ్చలేదని, చిన్న పిల్లల గేమ్ చూస్తున్నట్లు ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ అస్సలు రాముడిగా సెట్ కాలేదు అనడంతో ఫ్యాన్స్ కి చాలా కోపం వచ్చేసింది. నువ్వేవిడివి రివ్యూ చెప్పడానికి అంటూ పిచ్చ తిట్లు తిట్టేసారు. అక్కడ ఉన్న వారు బలవంతంగా ఆపితే, అప్పుడు ఫ్యాన్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మరిన్ని ముఖ్య వార్తలు:
ఆదిపురుష్ లో హనుమంతుడిగా నటించిన దేవ్ దత్త గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

సమంత దారిలోనే లావణ్య త్రిపాఠి.. ఇదే నిజమవుతుందా ?

‘అవతార్’ అభిమానులకు చేదువార్త.. ‘అవతార్’ 3,4,5 విడుదల తేదీలలో భారీ మార్పులు..!

Visitors Are Also Reading