Home » భవ్యశ్రీ కేసులో నిందితులు ఎవరు ? ఈ కేసు గురించి పోలీసులు ఏమంటున్నారంటే..?

భవ్యశ్రీ కేసులో నిందితులు ఎవరు ? ఈ కేసు గురించి పోలీసులు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని భవ్య శ్రీ  H*త్య సంచలనం రేకెత్తిస్తోంది. ప్రేమ పేరుతో చిత్రహింసలు పెట్టి.. వేధించి ముగ్గురు వ్యక్తులు ఆమెను H*త్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో భవ్యశ్రీని చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్టు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చిత్తూరు జిల్లా పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో అసలు నిందితులు ఎవరు?  అనే అనుమానం వ్యక్తమవుతోంది.  ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవ్యశ్రీ కి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో #justiceForBhavyasri హ్యాప్ ట్యాగ్ తో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ హ్యాప్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.


ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ మరణానికి ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది.  ఒకేసారి ఆమెను నలుగురు అబ్బాయిలు ప్రేమించినట్టు సమాాచారం. అయితే ఆమె మాత్రం ఒక్కరినే లవ్ చేసినట్టు తెలుస్తోంది.  మిగతా ప్రేమ అనే భ్రమలో పడి..  ఆమెపై కక్ష పెంచుకుని ఆమెను కిడ్నాప్ చేశారు.  మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి వివస్త్రను చేశారని.. కళ్ళు పీకి, జుట్టు కత్తిరించి బావిలో పడేసి Haత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈనెల 17 నుంచి భవ్యశ్రీ ఆచూకి లభించలేదు. దీంతో  పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో.. బంధువులను ఆరా తీసి.. మరుసటి రోజు ఆమె తండ్రి మునికృష్ణ పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో తమ కూతురిని వేధిస్తున్నారని.. వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులకు చెప్పారు.  అయితే ఈ నెల 20న వేణుగోపాలపురం సమీపంలోని ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బావిలో ఉన్న నీళ్లు తోడించి భవ్యశ్రీ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. అయితే బావిలో మృతురాలు జుట్టు దొరకడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. భవ్యశ్రీని చిత్రహింసలకు గురిచేసి చంపి ఉంటారని ఆరోపిస్తున్నారు.

Advertisement

Advertisement


కానీ మరోవైపు భవ్యశ్రీని ఎవరూ రేప్ చేయలేదని.. పోలీసులు స్టేట్ మెంట్ ఇవ్వడంతో వాళ్లు కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసులో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు వాస్తవం కాదని.. చిత్తూరు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం.. మృతి చెందిన అమ్మాయిపై కానీ,  శరీరంపై కానీ గాయాలు లేవని స్పష్టం చేశారు. ఆమె తలపై ఊడిపోయిన జుట్టు బావిలో దొరికిందని.. అయితే తలపై గుండు కొట్టిన గుర్తులు తమకు కనిపించలేదన్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల కాల్ డీటెయిల్స్, టెక్నికల్ ఎనాలసిస్ ఆధారంగా విచారణ జరుపుకున్నామని తెలిపారు. నిందితులు ఎంతటివారైనా తాము ఉపేక్షించేది లేదని చెప్పారు పోలీసులు.  గుండు కొట్టించడం, కళ్ళు పీకేయడం అన్నీ అసత్య ప్రచారాలేనని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 మహేష్ బాబు సినిమా చేయనందుకు బాధపడుతున్న బాలీవుడ్ హీరోయిన్..!

 ప్రధాని మోడీ చాలా ఇష్టంగా తినే ఈ పరోటాతో మధుమేహం, రక్తపోటు మటుమాయం..!

Visitors Are Also Reading