Home » Cricket Balls : రెడ్‌, వైట్‌, పింక్‌ బాల్స్‌ మధ్య తేడా ఏంటి? ఈ రంగులే ఎందుకు?

Cricket Balls : రెడ్‌, వైట్‌, పింక్‌ బాల్స్‌ మధ్య తేడా ఏంటి? ఈ రంగులే ఎందుకు?

by Bunty
Ad

మొదట్లో రెడ్ బాల్ తోనే క్రికెట్ ఆడేవారు. 1971లో వన్డే క్రికెట్ మొదలుపెట్టాక రెడ్ బాల్ తో వన్డే మ్యాచ్ ఆడడం కష్టంగా మారింది. ఎందుకంటే రెడ్ బాల్ మార్నింగ్ టైం లోనే మంచిగా కనబడుతుంది. అప్పట్లో వన్డే క్రికెట్ లో ఇన్నింగ్స్ కు 60 ఓవర్ల చొప్పున ఉండేది. అంటే డే టైం లోనే మొత్తం 120 ఓవర్లను కంప్లీట్ చేయాలి. కానీ ఒక్కరోజులో అన్ని ఓవర్లు కంప్లీట్ చేయడం చాలా కష్టం.

White Cricket Ball, Red & Pink Cricket Ball, What's The Difference

White Cricket Ball, Red & Pink Cricket Ball, What’s The Difference

పైగా ఫ్లడ్ లైట్స్ లో రెడ్ బాల్ తో ఆడడం అస్సలు కుదరదు. మొదట్లో వన్డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు లైట్ ఫెయిల్ అయితే ఆ మ్యాచ్ ను మరుసటి రోజు ఆడించేవారు. 1977 నుంచి వైట్ బాల్ ను ఇంట్రడ్యూస్ చేశారు. అందువల్ల అప్పటి నుంచి వన్డే మ్యాచును డే అండ్ నైట్ ఫార్మాట్లో మొదలుపెట్టారు. డార్క్ స్కైలో వైట్ బాల్ క్లియర్ గా కనబడుతుంది.

Advertisement

Advertisement

అలాగే మ్యాచ్ చూసే వారికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. 2015వ సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ ను డే అండ్ నైట్ ఫార్మాట్లో ఆడడం ప్రారంభం చేశారు. కానీ ఫ్లడ్ లైట్స్ లో రెడ్ బాల్ తో ఆడడం చాలా డేంజర్. దీంతో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా పింక్ బాల్ ను ఇంట్రడ్యూస్ చేశారు.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ వర్ష మంచి మనసు! వాచ్మెన్ కుటుంబానికి సాయం!

పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్!

Actor Manas: శ్రీజతో ‘బ్రహ్మముడి’ సీరియల్ హీరో నిశ్చితార్థం

Visitors Are Also Reading