Home » విజయ్ దళపతి వారసుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? 

విజయ్ దళపతి వారసుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? 

by Anji
Ad

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మాస్టర్, బీస్ట్ సినిమాల తరువాత విజయ్ నటించిన తాజా చిత్రం  వరిసు. ఈ ఈ సినిమా  తెలుగులో వారసుడుగా విడుదల చేశారు. విజయ్ 66వ చిత్రం కావడంతో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీస్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. 

Advertisement

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వారసుడు చిత్రానికి తమిళంతో పాటు తెలుగులో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలుత సంక్రాంతి పండుగకు ముందుగానే జనవరి 11న విడుదల చేయనున్నట్టు ప్రకటించినా.. తెలుగులో మాత్రం జనవరి 14న విడుదల అయింది వారసుడు. తమిళంలో మాత్రం జనవరి 11నే విడుదల అయింది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ కావడంతో ప్రేక్షకులు పండుగ వేళలో ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. రెండు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.  

Advertisement

Also Read :  ఆర్జీవిని ఎంతో ఇష్టపడిన శ్రీదేవి ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదంటే..?

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని థియేట్రికల్ రన్ తరువాత 4నుంచి 6 వారాల తరువాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. అతిత్వరలోనే స్ట్రీమింగ్ అధికారికంగా ప్రకటించనున్నారట. సీనియర్ నటులు శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. 

Also Read :   జబర్దస్త్ హైపర్ ఆదికి MLA టికెట్.. ఏ పార్టీ నుంచి అంటే..?

Visitors Are Also Reading