18 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది. త్వరలోనే భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినటువంటి విషయం మనందరికీ విధితమే. అయితే ముఖ్యమంత్రి ప్రకటించిన నెల రోజులు కావస్తోంది. అయితే సాంకేతిక కారణాల వల్ల నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అవుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య
Advertisement
కాలంలోనే 34000 ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి సాంకేతిక కారణాల వల్ల నోటిఫికేషన్ల విడుదల ఆలస్యం అవ్వనుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పనులు ఈ నెల చివరి లోపు పూర్తవుతాయని తెలుస్తోంది. కసరత్తు పూర్తయిన వెంటనే నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తారని సమాచారం. ఇందులో ముఖ్యంగా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి
Advertisement
మొత్తం 503 ఖాళీలను భర్తీ చేయనున్నారట. గ్రూప్ 2 సంబంధించిన ఉద్యోగాలు ఇంటర్వ్యూలు లేకుండానే అభ్యర్థుల ఎంపిక చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా పోలీసు శాఖలో 3 ఏళ్ల వయోపరిమితి పెంపునకు కేసీఆర్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం అందరికి తెలిసిందే. అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ఈ విషయాలను బట్టి సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ నెల ఆఖరి లోపు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం .
ఇవి కూడా చూడండి :
ఉదయ్ కిరణ్ లవ్ స్టోరీ చిరంజీవికి ముందే తెలుసు.. కానీ ఏమి జరిగిందంటే..?
దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?