Telugu News » Blog » Udaykiran: ఉదయకిరణ్ ప్రేమ వ్యవహారం ముందే చిరంజీవికి తెలుసా ? కానీ ఏమి జ‌రిగిందంటే..?

Udaykiran: ఉదయకిరణ్ ప్రేమ వ్యవహారం ముందే చిరంజీవికి తెలుసా ? కానీ ఏమి జ‌రిగిందంటే..?

by Anji
Ads

తెలుగులో ఒక‌ప్పుడు ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటేడ్ చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకోవ‌డంతో పాటు ప‌లు నేష‌న‌ల్ అవార్డుల‌ను కూడా ద‌క్కించుకున్న తెలుగు స్వ‌ర్గీయ న‌టుడు ఉద‌య్ కిర‌ణ్ గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అతి చిన్న వ‌య‌స్సులోనే తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి హీరోగా నిల‌దొక్కుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉద‌య్‌కిర‌ణ్‌.

 

అనుకోకుండా ప‌లు ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో అక‌స్మాత్తుగా ఆత్మ‌హ‌త్య చేసుకుని త‌న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసాడు. తాజాగా ఉద‌య్ కిర‌ణ్ సోద‌రి ఓ ప్ర‌ముఖ యూట్యూబ్ ఛాన‌ల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో పాల్గొని ఉద‌య్ కిర‌ణ్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకున్న‌ది. అయితే ఇందులో భాగంగా ఉద‌య్ కిర‌ణ్ న‌టించిన మ‌న‌సంతా నువ్వే చిత్రం హిట్ అయిన త‌రువాత ఓ యువ‌తితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని కానీ ఏమైందో ఏమోకానీ కొంత కాలానికే వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలు త‌లెత్త‌డంతో వీరి ల‌వ్ బ్రేక‌ప్ అయింద‌ని తెలిసింది.

అంతేకాదు జీవితంలో అప్పుడప్పుడు కొన్ని బంధాల ప‌ల‌క‌రించి వెళ్లిపోతుంటాయ‌ని.. వాటి గురించి బాధ ప‌డ‌కుండా ఇక‌పై సినీ కెరీర్ పై దృష్టి సారించాల‌ని ధైర్యం కూడా చెప్పాడ‌ని వెల్ల‌డించింది. ఉద‌య్ కిర‌ణ్ త‌న ప్రేమ బ్రేక‌ప్ అయిన త‌రువాత కొంత కాలానికి చిరంజీవి కూతురుకు మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ చేశాడ‌ని.. చిరంజీవి కుటుంబ స‌భ్యులు మంచివాళ్ల‌ని కూడా తెలిపింది. త‌న కుటుంబ స‌భ్యులు ఎప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లినా చాలా ఆప్యాయంగా ప‌ల‌క‌రించే వాళ్ల‌ని చెప్పుకొచ్చింది. కానీ నిశ్చితార్థం అయిన త‌రువాత ఉద‌య్ కిర‌ణ్ సుష్మిత‌ల అభిరుచులు క‌ల‌వ‌క‌పోవ‌డం, అదేవిధంగా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల పెళ్లి ఆగిపోయింద‌ని అంతే త‌ప్ప త‌ను ఇరువురి కుటుంబాల మ‌ధ్య మ‌న‌స్పార్థాలు, విబేధాలు ఏమి లేవ‌ని కూడా క్లారిటీ ఇచ్చింది.

ముఖ్యంగా చిరంజీవి కుటుంబ స‌భ్యుల‌తో త‌న‌కు ఇప్ప‌టికీ స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది. ఉద‌య్ కిర‌ణ్‌కు ఎలాంటి ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు లేవ‌ని కేవ‌లం త‌న కెరీర్ గురించి మాత్ర‌మే ఎప్పుడూ దిగులుగా ఉండేవాడ‌ని వెల్ల‌డించింది. అంతేకాదు.. త‌న త‌ల్లి కోట్ రూపాయల విలువ చేసే ఆస్తుకు దాదాపు 4 కేజీల బంగారం ఉద‌య్ కిర‌ణ్‌కు అప్ప‌గించిన‌ట్టు కూడా తెలిపింది. త‌ల్లి మ‌ర‌ణాంతరం ఉద‌య్ కిర‌ణ్ అన్ని తానై పెంచాన‌ని కానీ ఉన్న‌ట్టుండి ఇంత పెద్ద నిర్ణ‌యం తీసుకుని లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతాడ‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని కొంత మేర‌కు ఎమోష‌న‌ల్ అయింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

  1. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటున్న వంటలక్క.. కండిషన్స్ ఏమిటంటే..!!
  2. SAMANTHA : ఎంత విడిపోతే మాత్రం ఇలా చేయాలా ? సమంతా ? పాపం చైతు !
  3. ఆలియాభట్, రణ్ బీర్ కపూర్ ల వివాహంలో ఏం జరిగిందో తెలుసా..!!

You may also like