Home » దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్‌లో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో దేవుళ్ళు అనే భ‌క్తిర‌స చిత్రం 22 ఏళ్ల క్రితం తెర‌కెక్కింది. అల‌నాటి అందాల తార రాశి, పృథ్వి జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో మ‌రొక ఇద్ద‌రు చిన్నారులు కూడా న‌టించారు. పృథ్వి, రాశి భార్య‌భ‌ర్త‌లుగా న‌టించిన ఈ చిత్రం వారిద్ద‌రూ విడిపోతారు. విడిపోయిన త‌మ త‌ల్లిదండ్రుల‌ను క‌లిపేందుకు ఆ ఇద్ద‌రు చిన్నారులు ప‌డిన తాప‌త్ర‌యం.. భ‌క్తి పాట‌లు, కోడి రామ‌కృష్ణ టేకింగ్ ఇలా అన్ని క‌ల‌గ‌లిసి ఈ సినిమాను విజ‌య‌వంతం చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాయి.


ముఖ్యంగా ఎలాంటి అంచ‌నాలు కూడా లేకుండా విడుద‌లైన ఈ సినిమా ఆ రోజుల్లోనే చాలా కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న‌ది. తొలి వారం రోజుల ఈ సినిమా గురించి పెద్ద‌గా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ ఆ త‌రువాత క్ర‌మ‌క్ర‌మంగా సినిమా జ‌నాల‌కు ఎక్కేసింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా దేవుళ్ళు సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టి సూప‌ర్ హిట్ చేసారు. రాశి-పృథ్విరాజ్ భార్య భ‌ర్త‌లుగా న‌టిస్తే.. వాళ్ల‌కు కూతురు-కుమారుడిగా బేబీ నిత్య‌- మాస్ట‌ర్ నంద‌న్ న‌టించారు. త‌ల్లిదండ్రుల ప్రేమ కోసం ప‌రిత‌పించే చిన్నారులుగా నిత్య నంద‌న్ చేసిన న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది.

Advertisement

Advertisement

మీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ వీరిద్ద‌రూ పాడిన పాట ఇప్ప‌టికీ కూడా ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోతుంది. 22 ఏళ్ల క్రితం దేవుళ్ళు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన బేబీ నిత్య‌శెట్టి ఇప్పుడు హీరోయిన్ అయింది. నిత్య హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన మొద‌టి సినిమా పిట్ట‌క‌థ‌. ఈ చిత్రం అనుకున్నంత స‌క్సెస్ కాక‌పోయినా న‌ట‌న ప‌రంగా మాత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో నిత్య‌ని చూస్తే.. ఆమె చిన్న‌ప్పుడు దేవుళ్లులో పోషించిన పాత్ర‌ను చూసి అస్స‌లు గుర్తు ప‌ట్టలేరు. పిట్ట‌క‌థ సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ న‌ట‌న‌ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. ఇక నిత్య ప్యూచ‌ర్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి మ‌రి.

ఇవి కూడా చ‌ద‌వండి :

  1. వింత ఆచారం !ఆ ప్రాంతంలో శోభనం గదిలో వధువుతో పాటు తల్లి కూడా వెళాళ్లట ఎందుకంటే ?
  2. SAMANTHA : ఎంత విడిపోతే మాత్రం ఇలా చేయాలా ? సమంతా ? పాపం చైతు !
  3. ఆలియాభట్, రణ్ బీర్ కపూర్ ల వివాహంలో ఏం జరిగిందో తెలుసా..!!\
Visitors Are Also Reading