Home » అన్నం, చపాతి తినకుండా ఏం తినాలి..?

అన్నం, చపాతి తినకుండా ఏం తినాలి..?

by Anji
Ad

సాధార‌ణంగా ప్ర‌తిరోజు ఇంటి భోజ‌నం తిని బోరు కొడుతుంద‌ని స్ట్రీట్ ఫుడ్ తినాల‌నే ఆస‌క్తి ఉంటుంది. చాలా వ‌ర‌కు ఎక్కువ‌గా బ‌య‌ట హోట‌ళ్ల‌లో కార్బోహైడ్రెట్స్ క‌లిగిన ఆహార ప‌దార్థాలే క‌నిపిస్తుంటారు. ప్రోటీన్లు క‌లిగిన ఆహారం ఉన్న‌ప్ప‌టికీ మ‌నం ఆ ఆహారాన్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డం. ప్రోటీన్లు క‌లిగిన అరటిపండ్లు, యాపిల్స్‌, లేదా ఎగ్ ఆమ్లెట్ వంటివి తీసుకోవ‌డం బెట‌ర్‌. ఇడ్లీ, దోశ‌, ఉప్మా అయితే వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. కార్బోహైడ్రేట్ల‌ను తీసుకుంటే డ‌యాబెటిస్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

భార‌తీయులు ప్ర‌ధానంగా తినే ఆహారంలో అన్నం, రొట్టెలే ఎక్కువ‌గా ఉంటాయి. ఉత్తారాదిలో రొట్టెలు, దుంప‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తే.. ద‌క్షిణాదిలో బియ్యంతో చేసిన వంట‌కాలే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్న‌ర్ వ‌ర‌కు ఎక్కువ‌గా తినే ఆహారం ఇడ్లీ, దోశ‌, బ్రెడ్, పూరి, ఉప్మా, పొంగ‌ల్‌, చ‌పాతి, అన్నం, బిర్యాని, ప‌లావ్ వీట‌న్నింటిలో కూడా కార్బోహైడ్రేట్లు పుష్క‌లంగా ఉంటాయి. పండుగ‌లో చేసే పిండి వంట‌ల్లో, దేవాల‌యాల్లో పంచే ప్ర‌సాదాల్లో కూడా కార్బోహైడ్రేట్స్ క‌నిపించ‌డం విశేషం. కార్బోహైడ్రేట్ల‌ను త‌గ్గించి ప్రోటీన్‌, పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ప్ర‌ధానంగా 65-70 శాతం కార్బోహైడ్రేట్లు, 10 శాతం ప్రోటీన్, 20 శాతం కొవ్వు ప‌దార్థాలు ఉంటున్నాయ‌ని అధ్య‌య‌న కారులు చెబుతున్నారు. కార్బ్స్‌ను 50-55 శాతానికి త‌గ్గించి ప్రోటీన్ 20 శాతానికి పెంచాల‌ని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

కొంత మంది అన్నం తినకుండా ఉండలేరు. కొంత మంది రొట్టెలు తినంది భోజనం చేసినట్టు ఉండదని మాటలు చెబుతుంటారు. పూర్తిగా కార్బోహైడ్రేట్లు లేని ఆహారం తీసుకోవడం మాత్రం సాధ్యమయ్యే పని కాదు. కార్బోహైడ్రేట్స్ ఆహారం మానేయడం వల్ల మెదడుకు తగినంత గ్లూకోజ్ అందదని నిపుణులు పేర్కొంటున్నారు. మధుమేహంతో బాధపడే వారు పూర్తిగా కార్బోహైడ్రేట్స్ లేని భోజనంను తీసుకోవడం బెటర్. బియ్యం, వరి నూకలతో చేసే ఇడ్లీ, దోశలకు బదులు జొన్న, సామ, రాగుల లాంటి చిరు ధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశలను బ్రేక్ ఫాస్ట్ చేర్చుకోవచ్చు. అదేవిధంగా గోధుమ రవ్వతో చేసే ఉప్మాకు బదులు జొన్న లేదా కొర్ర రవ్వతో చేసే ఉప్మా, పొంగల్ తినవచ్చు. ఇందులో క్యారట్, బీన్స్, పచ్చిబఠాణి వంటి కూరగాయలు చేర్చుకోవచ్చు. వీటితో ఉడికించిన గుడ్ఢు, లేదా ఆమ్లెట్ తినవచ్చు. ఓట్స్, అరటి, ఆపిల్, నారింజ, బొప్పాయి వంటి పండ్లను కూడా తీసుకోవచ్చు.

Also Read :  మీ భాగస్వామికి మీపై ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే.. ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!!


శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే మాత్రం వాల్ నట్స్, బాదం పప్పు, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. ప్రోటీన్లు చేపలు, చికెన్, గుడ్లు, పనీర్, చోలే, బఠాణీ వంటి వాటిలో అధికంగా ఉంటాయి. మధ్యాహ్నం వేళలో ఏ ఆహారమైన తీసుకోవచ్చు. కానీ రాత్రి వేళలో మాత్రం సూపుగా, తేలికగా జీర్ణమయ్యే సూపులు, ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో రోజుకు 54 నుంచి 57 శాతం వరకు మాత్రమే కార్భోహైడ్రేట్లు ఉండాలి. ప్రోటీన్ 16 నుంచి 20 శాతం వరకు, కొవ్వు పదార్థాలు 20 నుంచి 24 శాతం వరకు ఉండాలి. మహిళలు పురుషుల కంటే ఎక్కువగా రెండు శాతం తగ్గించాలని అధ్యయనం చెబుతోంది. స్వీట్లు కొవ్వులేని చికెన్,చేపలు, తెల్ల సొన, తక్కువ కొవ్వుతో ఉండే పాలు, చీజ్, మజ్జిగ వంటివి తీసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే మన పూర్వకాలంలో పెద్దలు తీసుకున్న ఆహారాన్ని మరల మనం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలం. వాటికి బదులు మందులతో తయారు చేసిన ఫుడ్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

Also Read :  కాఫీని ఇలా తీసుకుంటే మీ బానా పొట్ట మాయం కావ‌డం ప‌క్కా..!

Visitors Are Also Reading