Home » అందరిలో ఉత్కంఠత రేపుతున్న సీఎం జగన్ ఢిల్లీ టూర్ అందుకోసమేనా..?

అందరిలో ఉత్కంఠత రేపుతున్న సీఎం జగన్ ఢిల్లీ టూర్ అందుకోసమేనా..?

by Mounika
Ad

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్  దద్దరిల్లుతోంది. బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సామాన్య ప్రజల నుంచి కార్యకర్తలు, అభిమానుల వరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో పరిస్థితి ఇలా ఉండగా, సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి  లండన్‌ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభిమానుల ఆందోళన తెలుగు రాష్ట్రాల నుంచి లండన్‌కు పాకింది. బాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా లండన్‌లో ఎన్నారై నిరసన తెలిపారు. లండన్ లో జగన్ బస చేసిన ప్రాంతంలో ఆందోళనలు జరిపారు.

Advertisement

 ఇక ఈ లండన్ పర్యటనను ముగించుకుని వచ్చిన జగన్  నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణాలు ఏమిటి..?  చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కేంద్ర బిజెపి పెద్దలతో ఆ విషయంపై చర్చించేందుకు వెళ్తున్నారా..? లేక మరి ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనేది అందరిలో ఉత్కంఠ కలిగిస్తోంది. ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో,  జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లడంపై ఆసక్తి నెలకొంది.

Advertisement

ఈరోజు ఢిల్లీలో కేంద్ర బిజెపి నాయకులతో జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం వెనుక కారణం అయ్యి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం లోక్ సభ,  అసెంబ్లీకి ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని భావిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు జూన్ వరకు గడువు ఉండడంతో ముందస్తుగా నిర్వహించాలా  లేక సాధారణ ఎన్నికలకు వెళ్లాలా అనే సందిగ్ధం లో జగన్ ఉన్నారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో  ఈ బిల్లు గనుక పెడితే వైసీపీ మద్దతు కోసం  పిలిచి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయంపై  జగన్ ఎక్కడ కూడా బహిరంగంగా స్పందించలేదు. కేంద్ర బీజేపీ నాయకులు సూచనలతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర బీజేపీ పెద్దలతో జగన్ భేటీకి సిద్ధమవుతున్న  విషయం అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

Also Read :

టీడీపీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?

చంద్రబాబు నాయుడు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్న నన్నపనేని రాజకుమారి..

Visitors Are Also Reading