Home » చంద్రబాబు నాయుడు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

చంద్రబాబు నాయుడు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

by Mounika

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం జాతీయ నేతలు సైతం ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానం సరైన పద్ధతి కాదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎఫ్ఐఆర్​లో పేరు లేకుండానే ముఖ్యమంత్రిగా సుధీర్ఘ కాలం పనిచేసిన ఒక వ్యక్తి ప్రతిపక్ష నేతను అయినా చంద్రబాబు నాయుడుని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని బండి సంజయ్​ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ ప్రజల్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ పట్ల సానుభూతి పెరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని.. చట్టానికి ఎవరూ అతీతులు వెల్లడించారు.

ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఈ విషయంపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమాచారం అందించారని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఎఫ్​ఐఆర్​ కాపీ కూడా లేకుండా ఎలా అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు అరెస్ట్ పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ఇది కేవలం వైసీపీ పార్టీ కక్షపూరితంగా చేస్తుందని అభిప్రాయాలు వెళ్లడవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు.

Also Read :

టీడీపీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?

పాకిస్థాన్ కు బిగ్ షాక్.. ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు అవుట్ !

‘సలార్’ వాయిదాపై స్పందించిన చిత్ర యూనిట్.. కొత్త డేట్ ఎప్పుడంటే..?

Visitors Are Also Reading