Home » పరగడుపునే నిమ్మరసం తాగితే ఏమవుతుందంటే..?

పరగడుపునే నిమ్మరసం తాగితే ఏమవుతుందంటే..?

by Anji
Ad

సాధారణంగా చాలా మంది నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. మీ రోజును ప్రారంభించడానికి ఉత్తమమైన మార్గం నిమ్మరసం తాగడం. మీరు ఉదయం వేళలో నిమ్మరసం తాగుతూ.. రోజుని ప్రారంభిస్తే.. దాని నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇందులో ప్రోటీన్లు, కార్బొహైడ్రెట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల మెరిసే చర్మంతో పాటు పలు వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అదేవిధంగా ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పని చేస్తుంది. శరీరం నుంచి విష వ్యర్థాలను తొలగిస్తుంది.

Advertisement

మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగాలి. రోజుకు కనీసం రెండుసార్లు ఇలా తాగవచ్చు. ఇది మీ శరీరాన్ని సమతుల్యం చేయడంతో పాటు మీ జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. రెగ్యులర్ వినియోగం కొద్ది రోజుల్లోనే  మీ బరువును సులభంగా తగ్గిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మానికి మేలు చేస్తుంది. నిమ్మకాయ తీసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు చర్మ సంబంధిత సమస్యలు అన్ని తొలగిపోతాయి. నిమ్మకాయ నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పని చేస్తుంది. శరీరం నుంచి అన్ని విష పదార్థాలను తొలగిస్తుంది. నిమ్మకాయను మరిగించి నీళ్లు తాగితే శరీరంలోని విషపూరిత వ్యర్థాలు తేలికగా తొలగిపోతాయి. రోజు ఉదయం నిమ్మరసం తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఫ్లేవనాయిడ్లను కలిగి ఉన్నందున కడుపు సంబంధిత వ్యాధులకు ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  

Advertisement

Also Read :  ఈ జ్యూస్ తాగితే పొట్ట, నడుము చుట్టూ కొవ్వు మాయం అవ్వడం పక్కా..!

Manam News

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి జలుబును వదిలించుకోవడానికి చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ నీటిలో సిట్రిక్, ఆస్కార్బిక్ ఆమ్లాలుంటాయి. మీ జీవక్రియను సరైన స్థితిలో ఉంచడంతో పాటు.. PH స్థాయిని సరైన స్థాయిలో ఉంచుతాయి. శ్వాస తీసుకోవడం సులభతరమవుతుంది. ఆస్తమా పేషెంట్లకు మేలు చేస్తుంది. ఉదయాన్నే పరగడుపునే నిమ్మరసం సేవించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మెటబాలిజం పెరగడంతో పాటు అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు పరగడుపునే నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. 

Also Read :  బెల్లం టీ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తాగకుండా ఉండలేరు..!

Visitors Are Also Reading