Home » Weekly Horoscope : రాశిఫలాలు 03-09-2023 నుంచి 09-09-2023

Weekly Horoscope : రాశిఫలాలు 03-09-2023 నుంచి 09-09-2023

by Bunty
Ad

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ రాశి ఫలాలు చూసుకుంటున్నారు. అయితే, ఈ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తులకు ప్రతి రోజూ ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తును అంచనా వేయగలరు. ఇలా మేషం మీనం వరకు.. 03-09-2023 నుంచి 09-09-2023 ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

మేషం
పనులు వేగవంతంగా పూర్తవుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. కాలం అనుకూలంగా ఉంది. కష్టపడితే తగిన ప్రతిఫలం ఉంటుంది. రాబడి పెంచుకునే మార్గాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రుల వల్ల పనులు నెరవేరుతాయి.

వృషభం
బరువు, బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. శ్రమ పెరిగినప్పటికీ ఉత్సాహంగా పనిచేస్తారు. ఉద్యోగులకు మంచి సమయం. బంధు మిత్రులతో కార్య సాఫల్యం ఉంది. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. అన్నదమ్ములతో సంతోషంగా కాలం గడుపుతారు.

మిథునం
రోజువారి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సమయస్ఫూర్తితో పనులు చక్కబెడతారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు. బంధుమిత్రుల రాకతో సంతోషంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూలమైన వాతావరణముంటుంది.

కర్కాటకం
పదోన్నతి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. బందు వర్గంతో పనులు నెరవేరుతాయి. భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

సింహం
తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వారాంతంలో పూర్తవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు. ప్రభుత్వ, రాజకీయ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.

Advertisement

కన్య
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. బంధువర్గంతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. పని భారం పెరిగిన చాకచక్యంగా పూర్తి చేస్తారు.

 

తుల
కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆర్థిక సమస్యలతో ఆలస్యంగా పూర్తి కావచ్చు. రాబడికి మించి ఖర్చులు ఉండవచ్చు. నియంత్రణ అవసరం. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పనులు పూర్తి చేయడంలో జాప్యం జరగవచ్చు.

వృశ్చికం
సంతోషంగా ఉంటారు. అధికారులు ఆదరణ లభిస్తుంది. రోజు వారి కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. బందు వర్గం సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. నూతన వాహనం, భూమి కొనుగోలు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

ధనుస్సు
ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పూర్వం తలపెట్టిన పనుల్లో కదలిక వస్తుంది. వివాహది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన వారం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు.

 

మకరం
ఆదాయం స్థిరం. అధికారులతో స్నేహంగా ఉంటారు. రోజువారి కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి.

కుంభం
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. భక్తి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు. అనవసరమైన చర్చలతో కాలయాపన జరుగుతుంది. వివాదాల మూలంగా మనశ్శాంతి కోల్పోతారు. కొత్త ఉద్యోగంలో చేరతారు.

మీనం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి స్థాయిలో నిలుస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. రావాల్సిన డబ్బు వస్తుంది. స్థిరా, చరాస్తులు ద్వారా ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి.

Read Also : World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ నుంచి ఇండియా ఔట్.. కారణాలివే..!

 

Visitors Are Also Reading