Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి

by Anji
Ad

రాశి ఫ‌లాలు డైలీ చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 17.07.2022 నుండి 23.07.2022 వరకు

మేషం :

Mesha

Mesha

వ్యాపారంలో స‌త్ప‌లితాలు ఉంటాయి. కోరుకున్న ధ‌నం ల‌భిస్తుంది. ప‌ట్టుద‌ల ఆత్మ‌విశ్వాసం గొప్ప‌వారిని చేస్తాయి. ఒక్కొక్క‌సారి పరీక్ష కాలంగా అనిపిస్తుంది. శాంత చిత్తంతో వ్య‌వ‌హ‌రిస్తే విఘ్నాలు తొలుగుతాయి. దైవ చింత‌న‌, సౌమ్య సంభాష‌ణ మేలు చేస్తాయి. క‌ల‌హాల‌కు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్దు.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

ఉత్త‌మ‌కాలం న‌డుస్తోంది. శుభ‌యోగాలున్నాయి. మంచి పేరు సంపాదిస్తారు. అనుకున్న ప‌నుల‌న్ని పూర్త‌వుతాయి. స్థిర‌త్వం వ‌స్తుంది. సుఖ‌మైన జీవితం ల‌బిస్తుంది. అవ‌స‌రాల‌కు డ‌బ్బు అందుతుంది. ఇంట్లో శుభాలు జ‌రుగుతాయి. అవ‌రోధాలు తొల‌గుతాయి. వ్యాపారంలో శ్ర‌ద్ధ పెంచాలి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

వ్యాప‌ర బ‌లం, ద‌న‌యోగం అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగంలో శుభ‌ప‌లితం వ‌స్తుంది. చంచ‌ల‌త్వం లేకుండా నిర్ణ‌యం తీసుకోవాలి. స‌త్యానికే క‌ట్టుబ‌డి ఉండండి. ఆటంకాలు తొల‌గుతాయి. కొంద‌రి వ‌ల్ల గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. గ‌త సంఘ‌ట‌న‌లు కొన్ని ఇబ్బంది పెడ‌తాయి. ఓర్పుతో ధైర్యంగా ప‌ని చేయాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ముఖ్య కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. ఉద్యోగంలో శ్ర‌మ పెరుగుతుంది. ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి. తొంద‌ర‌ప‌డ‌వ‌ద్దు. తెలియ‌ని వాటిలో త‌ల‌దూర్చ‌వ‌ద్దు. పేరు ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. కొంద‌రి వ‌ల్ల ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికి దైవానుగ్ర‌హంతో లక్ష్యాన్ని చేరుతారు. ఆర్థికంగా మిశ్ర‌మ కాలం, ఖ‌ర్చు త‌గ్గించండి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఆశ‌యం నెర‌వేరుతుంది. ఒత్తిడి లేకుండా ఒక ప్ర‌ణాళిక‌తో బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేయండి. ధ‌న‌లాభం ఉంది. స‌న్మార్గ మార్గంలో అభివృద్ధి సూచితం. అర్హ‌త‌కు మించి ప‌నులు చేయ‌వ‌ద్దు. తెలియ‌ని విఘ్నాలు ఉంటాయి. త‌క్కువ‌గా మాట్లాడ‌డం మంచిది. ధ‌ర్మ‌చింత‌న మంచిది.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

మంచి ఉద్దేశంతో పని ప్రారంభించండి. మీకు క‌లిసి వ‌స్తుంది. చ‌క్క‌ని ఆలోచ‌న స‌ర‌ళి గొప్ప విజ‌యానికి బాట వేస్తుంది. స‌త్య నిష్ట అవ‌స‌రం. కుటుంబ ప‌రంగా క‌లిసి క‌ట్టుగా ఉండాలి. అవ‌రోదాలు చికాకు పెట్టినా ఉద్యోగ వ్యాపారాలు మంచి ప‌లితాన్ని ఇస్తాయి. కాలం సానుకూలం.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఉద్యోగం బాగుంటుంది. త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. అవ‌స‌రాల‌కు ద‌నం అందుతుంది. సంక‌ల్పం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మిశ్ర‌మ ప‌లితాలు క‌నిపిస్తున్నాయి. చంచ‌ల స్వ‌భావం లేకుండా ప్ర‌ణాలిక‌తో ప‌ని చేయండి. కుటుంబ ప‌ర‌మైన బాద్య‌త‌లు పెరుగుతాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

శ్ర‌ద్ధ‌గా చేసే ప‌నులు బ్ర‌హ్మాండ‌మైన ఫ‌లితాన్నిస్తాయి. ఆటంకాలు తొల‌గుతాయి. ఉద్యోగంలో ఉత్త‌మ ఫ‌లితం ఉంటుంది. స‌ద్భావ‌న‌తో ముందుకు సాగితే బంగారు జీవితం ల‌భిస్తుంది. ఇంట్లో శుభ‌కార్యాలు జ‌రుగుతాయి. దోషాలు తొల‌గుతాయి. అదృష్ట‌యోగం సూచితం. స‌మిష్టి కృషి శ‌క్తిని ఇస్తుంది.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

కాలం అనుకూలంగా లేదు. స‌న్నిహితుల‌తో చ‌ర్చించి నిర్న‌యాలు తీసుకోండి. య‌థాలాపంగా ఏ ప‌ని చేయ‌వ‌ద్దు. తెలియ‌ని ఆటంకాలు ఉంటాయి. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. చెడు ఆలోచించ‌వ‌ద్దు. ఈర్ష్య‌ప‌డే వారు ఉంటారు. సున్నితంగా స్పందించాలి. ఆర్థిక విష‌యాల్లో తొంద‌ర ప‌నికి రాదు.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

శ్ర‌ద్ధ‌గా ప‌ని చేయండి. స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి. మీ ప్ర‌మేయం లేక‌పోయినా విమ‌ర్శించే వారు ఉంటారు. నిదానంగా కార్య‌సిద్ధి ల‌భిస్తుంది. ప‌నులు వాయిదా వేయ‌కుండా పూర్తి చేయాలి. ఆరోగ్యం జాగ్ర‌త్త‌. ఆవేశ‌ప‌రిచే స‌న్నివేశాలు ఉంటాయి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో వారి సూచ‌న‌లు అవ‌స‌రం.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఎటు చూసినా విజ‌య‌మే గోచ‌రిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణ‌యాలు స్థిర‌మైన భ‌విష్య‌త్ ని ఇస్తాయి. ధ‌న‌, ధాన్య లాభాలు ఉంటాయి. పేరు ప్ర‌ఖ్యాతులు గ‌డిస్తారు. కోరిక‌లు నెర‌వేరుతాయి. ఉద్యోగంలో ఉత్త‌మ ఫ‌లితం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న‌త స్తితి ల‌భిస్తుంది. స‌మాజానికి మేలు చేసే ప‌నులు చేప‌ట్టండి.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

ఆర్థిక అంశాలు బాగుంటాయి. అవ‌స‌రాల‌కు ధ‌నం ల‌భిస్తుంది. క‌ష్ట‌మైన ప‌నులు పూర్తి చేయండి. చంచ‌ల‌త్వం లేకుండా నిర్ణ‌యం తీసుకోండి. వ్యాపారంలో జాగ్ర‌త్త అవ‌స‌రం. స్వ‌యం కృషితో ముందుకు వెళ్లాలి. కాలం వ్య‌తిరేకంగా ఉంది. ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటూ పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చూడాలి.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Visitors Are Also Reading