Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 09.07.2023 నుంచి 15.07.2023 వరకు మేషం :

Mesha

Mesha

విజయం వరించే అవకాశముంది. ఉత్సాహంగా పని చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.  నూతన ప్రయత్నాలు విజయవంతంగా ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

విజయమే ధ్యేయంగా పని చేయాలి. ఉద్యోగంలో ఏకాగ్రత చాలా అవసరం. ప్రశాంతంగా ఆలోచించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాలి. ఎప్పటి పనులు అప్పుడే విజయవంతంగా పూర్తి చేయాలి. అవసరాలకు ధనం అందుతుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. అపార్థాలకు అస్సలు తావివ్వకూడదు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

పలు మార్గాలలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో శుభయోగాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభం ఉంటుంది. ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. అవరోధాలను అధిగమిస్తారు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆశయం నెరవేరే వరకు  కృషి చేస్తూనే ఉండాలి. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉద్యోగంలో సమస్యలను గత అనుభవంతో పరిస్కరించాలి. మిత్రులు ఇచ్చినటువంటి సలహాలు విజయవంతం అవుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా సమస్య జఠిలమవుతుంది. కాలం వ్యతిరేకంగా ఉంది. పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలి. ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పి చేయాలి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉద్యోగంలో ఆశయం నెరవేరుతుంది. బాధ్యతాయుతంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పనులు వాయిదా వేయకూడదు. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారం బాగుంటుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఓ ఆపద నుంచి బయటపడుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. 

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

సకాలంలో పనులను విజయవంతంగా పూర్తి చేయండి. ఎదురుచూస్తున్న విజయం లభిస్తుంది. ఉద్యోగంలో క్రమ క్రమంగా ఉన్నత స్థితికి చేరుతారు. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎవరి మాటలు పట్టించుకోకూడదు.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ప్రయత్న బలాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏకాగ్రత చాలా అవసరం. వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే విజయవంతంగా పూర్తి చేయాలి. ప్రణాళికలతోనే అనుకున్నది సాధించగలరు. భూ, గృహ, వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. చేతి వరకు వచ్చిన ఓ పని మధ్యలోనే ఆగుతుంది. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు ఆలస్యమవుతాయి. గత అనుభవంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆత్మ విశ్వాసం చాలా అవసరం. ఆర్థికంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆవేశం అస్సలు పనికిరాదు.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. ప్రశాంతంగా ఆలోచించి భవిష్యత్ కోసం ప్రణాళికలను సిద్ధం చేయండి. వారం మధ్యలో ఓ పని విజయవంతంగా పూర్తి అవుతుంది. ఓ శుభవార్త వింటారు. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఉద్యోగం చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పని విజయవంతంగా పూర్తి అవుతుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. మేలు చేసే వారు ఉన్నారు. కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. అనుకున్నది సాధించేవరకు కృషి కొనసాగించండి. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

వ్యాపార లాభాలు ఉంటాయి. మొహమాటం లేకుండా వ్యవహరిస్తేనే ఆర్థికంగా నష్టాలను నిరోధించవచ్చు. వివాదాలకు అవకాశముంది. మనోభావాలను నొప్పించకుండా మాట్లాడాలి. సమిష్టి నిర్ణయాలు చాలా మేలు చేస్తాయి. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. ఉద్యోగంలో పనులు వాయిదా వేయకూడదు. ఆరోగ్యం పై శ్రద్ద వహించడం చాలా అవసరం.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. పనులను మధ్యలో ఆపకూడదు. ముఖ్యమైన వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. ఇతరులకు ధనం ఇస్తే తిరిగి రాదు. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు.

Visitors Are Also Reading