Telugu News » Blog » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ధ‌న‌లాభం క‌లుగుతుంది

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ధ‌న‌లాభం క‌లుగుతుంది

by Anji

రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Ads

Weekly Horoscope in Telugu 04.09.2022 నుండి 10.09.2022 వరకు

మేషం :

Mesha

Mesha

సంపూర్ణ వియం ల‌భిస్తుంది. ఏకాగ్ర‌తతో ప‌ని పూర్తి చేయండి. మీ మీద మీకు న‌మ్మ‌కం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్ర‌శంస‌లందుకుంటారు. వ్యాపారంలో బాగుంటుంది. ఊహించిన దానికంటే మంచి ఫ‌లితాలే వ‌స్తాయి. ధ‌న‌యోగం ఉంటుంది. వాదోప‌వాదాల‌కు తావివ్వ‌కండి.

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

మంచి ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళ్లండి. స‌కాలంలో కార్య‌సిద్ధి ల‌భిస్తుంది. దైవానుగ్ర‌హం ఉంది. మీ ప‌నులు న‌లుగురికీ ఉప‌యోగ‌ప‌డుతాయి. ప్ర‌శంస‌లు అందుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. కుటుంబ‌ప‌ర‌మైన ప్రోత్సాహం ల‌భిస్తుంది. ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తూ బంగారు భ‌విష్య‌త్‌ని అందుకోండి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

 

శ్రేష్ట‌మైన కాలం. అనేక శుభ‌యోగాలు ఉన్నాయి. ఆరోగ్యంలో గుర్తింపు ల‌భిస్తుంది. ఎదురుచూస్తున్న ప‌ని పూర్తి అవుతుంది. ఆప‌ద‌లు తొలిగిపోతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. నూతన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి. దాన‌ధ‌ర్మాలు చేసే అవ‌కాశం ల‌భిస్తుంది. గృహ భూ వాహ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్లితే ఫ‌లితం వ‌స్తుంది. ఉద్యోగంలో కీర్తి ల‌భిస్తుంది. ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. వ్యాపార‌బ‌లం ఉంది. ధ‌న‌ధాన్య యోగం ఉంది. ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్టుగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ల‌క్ష్యాన్ని చేరాలి. సొంత నిర్ణ‌యం మేలు. ముఖ్య కార్యాల్లో ప‌ట్టు విడుపులు అవ‌స‌రం.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

వ్యాపార‌బ‌లం బాగుంది. లాభాలుంటాయి. ధ‌న‌ధాన్య వృద్ధి సూచితం. మాన‌వ ప్ర‌య‌త్నం చేయండి. ఉద్యోగంలో విసుగు లేకుండా ప‌ని చేయాలి. వివాదాల‌కు దూరంగా ఉండాలి. స‌మ‌స్య‌ల‌ను సున్నితంగా ప‌రిష్క‌రించాలి. వారం మ‌ధ్య‌లో ఒక ప‌ని పూర్త‌వుతుంది. అదృష్ట‌వంతులు అవుతారు.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

 

మ‌నోబ‌లం అవ‌స‌రం. ఉద్యోగంలో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. కాలాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. చిన్న పొర‌పాటు జ‌రిగినా స‌మ‌స్య పెద్ద‌ద‌వుతుంది. చెడు ఆలోచ‌న‌లు ఇబ్బంది పెడ‌తాయి. ఒంట‌రిగా ఉండ‌వ‌ద్దు. స‌మిష్టి కృషితో మంచి భ‌విష్య‌త్‌కి అవకాశం ఉంది.

Ads

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఉద్యోగంలో ప‌నికి త‌గిన ప్ర‌తిఫ‌లం అందుతుంది. ఆశయం నెర‌వేరాలంటే చంచ‌ల‌త్వం ఉండ‌కూడ‌దు. తెలియ‌ని ఆటంకాలు ఉంటాయి. స్థిర‌చిత్తంతో ముంద‌డుగు వేయండి. ఆవేశ‌ప‌రిచేవారున్నారు. స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించాలి. వ్యాపారంలో స‌మ‌స్య‌ను ఇంట్లో వారి సూచ‌న‌ల‌తో అధిగ‌మించండి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

శుభ‌కాలం న‌డుస్తోంది. విశేష‌మైన కార్య‌సిద్ధి ప‌లు శుభ‌యోగాలున్నాయి. సంద‌ర్భానికి త‌గిన‌ట్టు ఉప‌యోగించుకోవాలి. అధికార లాభం సూచితం. మంచి ఫ‌లితాలు సాధించే కాలం కాబ‌ట్టి ప్ర‌తీ నిమిషాన్నీ స‌ద్వినియోగం చేసుకోవాలి. ప‌లు మార్గాల్లో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఇంట్లో శుభాలు జ‌రుగుతాయి.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

 

మంచి అవ‌కాశాలు వ‌స్తాయి. ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేసి వాటిని సొంతం చేసుకోవాలి. ఉద్యోగం మంచి జ‌రుగుతుంది. తోటివారి ప్రోత్సాహం ల‌భిస్తుంది. విఘ్నం ఒక‌టి ఎదుర‌వుతుంది. జాగ్ర‌త్త‌గా అధిగ‌మించాలి. ఆర్థిక న‌ష్టం రాకుండా చూసుకోవాలి. కొన్ని విష‌యాల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ఏకాగ్ర‌త‌తో ముందుకెళ్లాలి. ఏ పనినీ కూడా మ‌ధ్య‌లో అస్స‌లు ఆప‌కూడ‌దు. ఉద్యోగంలో శ్ర‌ద్ధ పెంచాలి. అపార్తాల‌కు తావివ్వ‌కూడ‌దు. అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోండి. సొంత నిర్ణ‌యం శ‌క్తిని ఇస్తుంటుంది. ఆర్థికంగా మిశ్ర‌మ‌కాలం. రుణ పెర‌గ‌నివ్వ‌వ‌ద్దు.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

అభిష్ట‌ సిద్ధి ఉంది. మ‌నోబ‌లంతో ముందుకు సాగితే అదృష్ట‌వంతుల‌వుతారు. ఉద్యోగంలో తోటివారి స‌హ‌కార‌మందుతుంది. విఘ్నాలు చికాకు క‌లిగిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించాలి. ఆరోగ్యంపై ఒత్తిడి ప్ర‌భావం చూపుతుంది. బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించండి. వ్యాపారంలో మెలుకువ‌లు తెలుసుకోవాలి.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. అనుకున్న స‌మ‌యానికే ప‌నుల‌ను పూర్తి చేస్తారు. స్థిర‌మైన భ‌విష్య‌త్ ల‌భిస్తుంది. వ్యాపారం మిశ్ర‌మం. మొహ‌మాటంతో అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెడ‌తారు. కొంద‌రి వ‌ల్ల శ్ర‌మ పెరుగుతుంది. స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో జాగ్ర‌త్త‌గా భ‌విష్య‌త్‌ని తీర్చిదిద్దుకోవాలి. వారంత‌రానికి శాంతి ల‌భిస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వివాదాల‌కు దూరంగా ఉండాలి