Home » దిల్ రాజు ఇంటిలో పెళ్లి బాజాలు.. ఎన్టీఆర్ కూడా..!

దిల్ రాజు ఇంటిలో పెళ్లి బాజాలు.. ఎన్టీఆర్ కూడా..!

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర నిర్మాత  దిల్ రాజు  ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటిలో తమ కుటుంబ సినీ వారసత్వాన్ని అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో ఆశీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దిల్ రాజు సోదరుడు శిరీష్  కుమారుడు ఆశీష్ రెండేళ్ల క్రితం రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.

Advertisement

Advertisement

రౌడీ బాయ్స్ సినిమా తర్వాత ఆశీష్ రెడ్డి నటించిన సెల్ఫీష్  చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. ఈ సినిమా తర్వాత మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాడు ఈ యంగ్ హీరో. తన పెళ్లికి కూడా సిద్దమవుతున్నాడు. ఆశీష్ రెడ్డి విషయానికి వస్తే.. ప్రేమతో కూడిన పెద్దలు కుదిర్చిన వివాహంగా జరుగుబోతున్నది. ఇరు కుటుంబాలకు సన్నిహితంగా ఉండటంతో పెళ్లికి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దాంతో ఈ వివాహం ఫిబ్రవరి 14వ తేదీన జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దిల్ రాజు, శిరీష్, ఆశీష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, హర్షిత రెడ్డి సినీ ప్రముఖులకు వెడ్డింగ్ కార్డులను పంచుతున్నారు.ఎన్టీఆర్ , చరణ్ లాంటి ప్రముఖులకు వెడ్డింగ్ కార్డులు ఇచ్చారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading