Home » IPL 2023 : కావ్య పాపపై రివెంజ్ తీర్చుకున్న వార్నర్…

IPL 2023 : కావ్య పాపపై రివెంజ్ తీర్చుకున్న వార్నర్…

by Bunty
Ad

ఐపీఎల్ 2023 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఆ జట్టు ఓటమిపాలైంది. మొత్తం ఏడు మ్యాచుల్లో రెండు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో నిలిచింది. వరుసగా రెండు పరాజయాలతో లీగ్ ను ప్రారంభించిన సన్రైజర్స్ ఆ తర్వాత రెండు విజయాలతో జోరు కనబరిచి అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది.

READ ALSO :  నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన

Advertisement

 

కానీ ఆ తర్వాత వరుసగా మూడింటి లోను ఓటమిపాలై అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ బ్యాటింగ్ తో ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ ను ఈ తరుణంలోనే హైదరాబాద్ ఫ్రాంచైజీపై ఢిల్లీ క్యాపిటల్స్ సారధి డేవిడ్ వార్నర్ ప్రతీకారం తీర్చుకున్నాడు.

Advertisement

READ ALSO : నిర్మాత పరువు తీసిన సమంత… “చెవిలో వెంట్రుకలతో నువ్వు..” అంటూ సాలిడ్ కౌంటర్…!

SRH vs DC: కావ్య పాపపై రివేంజ్ తీర్చుకున్న వార్నర్ - Telugu MyKhel

డిసి విజయం సాధించగానే వార్నర్ గాల్లోకి ఎగురుతూ గంతులు వేశాడు. విజయగర్వంతో ఊగిపోయాడు. తనతోనే డ్రింక్స్ మోయిస్తారా… మీకు ఎలా బుద్ధి చెప్పానో చూడండి అన్న అర్థం వచ్చేలా ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. తమ ఆటగాళ్లతో గ్రౌండ్ మొత్తం కలియ తిరుగుతూ నానా హంగామా చేశాడు. ప్రస్తుత సీజన్ లో వార్నర్ నాయకత్వంలో డిసి గెలిచింది. కేవలం రెండో మ్యాచ్ అయినప్పటికీ ఏదో టైటిల్ సాధించానన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు.

READ ALSO :  జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి గుండెపోటు?

Visitors Are Also Reading