Home » వైష్ణవి చైతన్య తన కెరియర్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

వైష్ణవి చైతన్య తన కెరియర్ లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Mounika
Ad

గీతా ఆర్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్.కె.ఎన్ ప్రొడ్యూసర్ గా నిర్మించిన యూత్ ఎంటర్టైనర్ గా ఈ జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు పోషించగా.. నాగబాబు, సీతా, లీరీష, మౌనిక ప్రధాన పాత్రలలో నటించార. ఈ చిత్రానికి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి అదరగొట్టింది.

Advertisement

ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కథను తెరకెక్కించే విషయంలో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య నటనకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఇక శని ఆదివారాలు కావటంతో బేబీ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కింది. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వైష్ణవి ఇచ్చిన స్పీచ్ కూడా అందరిని బాగా ఆకట్టుకుంది. బేబీ చిత్రం సక్సెస్ సాధించడంతో ఇండస్ట్రీలో వైష్ణవి చైతన్య పేరు బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైష్ణవి కి సంబంధించిన మరో విషయం గట్టిగా వైరల్ అవుతుంది.

Advertisement

వైష్ణవి తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ అందరిని షాకింగ్ కు గురిచేస్తోంది. ఈమె సినిమాల్లోకి రాకముందు నుంచి యూట్యూబ్ లో వీడియో చేస్తూ ఉండేది. మొదటిలో యూట్యూబ్ సిరీస్ సాఫ్ట్ వేర్ డెవలపర్ తో వైష్ణవి మంచి క్రేజ్ సంపాదించుకుంది . దీంతో నెమ్మదిగా సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే అలావైకుంఠపురంలో చిత్రంలో అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటించింది.  సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఓ ఈవెంట్ లోనూ డాన్స్ కోసం అవకాశం అందుకుందట వైష్ణవి. దానికోసం రోజంతా కష్టపడి డాన్స్ చేసిందంట వైష్ణవి చైతన్య.

అందుకుగానూ ఆమె కేవలం రూ.700 పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంత తక్కువ రెమ్యూనిరేషన్ తీసుకున్న మొదటిగా అందుకున్న సంపాదన తనకు ఎంతో స్పెషల్ తెలియజేసింది వైష్ణవి. ఇక బేబీ సినిమాకు గాను వైష్ణవి కేవలం రూ.10 లక్షల లోపు రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బేబీ చిత్రం సక్సెస్ కావడంతో వైష్ణవి చైతన్యకి మరికొన్ని అవకాశాలు వస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

వెబ్ సిరీస్ తో తమన్నా కల నెరవేరింది. బాలీవుడ్ లో భారీ ఆఫర్ పట్టేసింది.

వెబ్ సిరీస్ తో తమన్నా కల నెరవేరింది. బాలీవుడ్ లో భారీ ఆఫర్ పట్టేసింది.

భోళా శంకర్ నుంచి ఆసక్తికర అప్డేట్.. పవన్ పాటకు స్టెప్పులేసిన మెగాస్టార్..!

 

Visitors Are Also Reading