Home » సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్లదే తప్పా.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు?

సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్లదే తప్పా.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు వివి వినాయక్ ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్ని అద్భుతమైనటువంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క స్టార్ హీరోకి కూడా ఈయన బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారని చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సినిమాల గురించి పలు విషయాలను వెల్లడించారు.

Advertisement

ప్రస్తుత కాలంలో సినిమాలకి ఓటీటీలు శత్రువులుగా మారాయని ఈయన వెల్లడించారు. ఒకప్పుడు నాటకాలకు సినిమాలు శత్రువులుగా మారగా ఇప్పుడు మాత్రం సినిమాలకి ఓటీటీలో శత్రువులు అయ్యాయని ఈయన వెల్లడించారు. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా సక్సెస్ లో డైరెక్టర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ, ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ తప్పు మొత్తం డైరెక్టర్ల పైకే వేస్తున్నారంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement


సినిమా డైరెక్టర్ ఇష్టప్రకారం తెరకెక్కదు. ఆ సినిమా హీరో, హీరోయిన్లకు, ఇతర చిత్ర బృందానికి, టెక్నీషియన్లకు కథ వివరించి వారందరికీ నచ్చినప్పుడే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అందరికీ నచ్చిన ఆ సినిమా ఫ్లాప్ అయితే కనుక డైరెక్టర్ పైనే తప్పు వేస్తున్నారు అంటూ, ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలకు కారణం అయ్యాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విషయంలో డైరెక్టర్ చెప్పినట్టే మేము చేసాము అంటూ ఈ సినిమా ఫ్లాప్ విషయంలో తమ పాత్ర ఏమాత్రం లేదంటూ చెప్పిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఇదే విషయం గురించి వివి వినాయక్ మాట్లాడడంతో మరోసారి ఈ విషయం చర్చలకు కారణమైంది.

Visitors Are Also Reading