Home » కాళ్ళు, చేతుల్లో ఈ మార్పులా…? అయితే బీ12 లోపమే..!

కాళ్ళు, చేతుల్లో ఈ మార్పులా…? అయితే బీ12 లోపమే..!

by Sravya
Ad

పోషకాహార లోపం వలన అనేక సమస్యలు కలుగుతుంటాయి. అందుకనే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోమని అంటూ ఉంటారు. పోషకాహార లోపం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అని తెలుసుకోండి. విటమిన్ బీ12 కూడా ఆరోగ్యానికి చాలా అవసరం విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే, అనేక సమస్యలకి అది దారితీస్తుంది. ఎర్ర రక్త కణాలు తయారీకి బీ 12 చాలా అవసరం. ఇది కనుక లోపిస్తే శరీర కణాలకి తగినంత ఆక్సిజన్ లభించదు. విటమిన్ బీ 12 లోపం ఉన్నట్లయితే కండరాలు బలహీనంగా మారుతాయి.

Advertisement

Advertisement

కాళ్ల కండరాలు బలహీనంగా మారితే నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. వీటివల్ల లోపం ఉన్నట్లయితే వికారంగా ఉంటుంది. బరువు కూడా బాగా తగ్గిపోతారు. శక్తిహీనంగా అనిపిస్తూ ఉంటుంది. ఈజీగా అలసిపోతారు. ఇలా కూడా విటమిన్ బి12 లోపమని మనం తెలుసుకోవాలి. హృదయస్పందన రేటు విటమిన్ బి12 లోపం వలన పెరుగుతుంది. చేతులు కాళ్ళల్లో ఒక రకమైన తిమ్మిరి వంటివి కనపడుతుంటాయి. ఇవన్నీ కూడా విటమిన్ బీ12 తగ్గాయని చెప్పే సంకేతాలు.

Also read:

Visitors Are Also Reading