Home » పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సేన్.. అమ్మాయి ఎవరంటే ?

పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సేన్.. అమ్మాయి ఎవరంటే ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ఎప్పుడూ వివాదాలలో నిలుస్తూ..  వార్తల్లో  ఉంటాడు.  ముఖ్యంగా ఆయన చుట్టూ ఎప్పుడూ  వివాదాలు ఉంటాయనే టాక్ కూడా ఉంది. ఇటీవలే బేబీ మూవీ విషయంలో వార్తల్లో నిలిచారు విశ్వక్ సేన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాస్త సైలెంట్ గానే ఉంటూ అభిమానులకు ఓ శుభవార్త చెప్పాడు. ఆ వార్త ఎలాంటిది అంటే.. అద్భుతమైన వార్త అనే చెప్పవచ్చు. తాను ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించాడు విశ్వక్ సేన్. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. 

Advertisement

ఇక ఇప్పటివరకు అభిమానులు, వెల్ విషర్స్ ఎంతగానో ఆదరించారు. సపోర్టు చేశారని, అందరినీ సపోర్టుతో జీవితంలో మరో ముందడుగు వేస్తున్నట్టు చెప్పారు విశ్వక్ సేన్. ఇక ఈ విషయం చెప్పడానికి తాను ఎంతో సంతోషిస్తున్నాని.. తన జీవితానికి సంబంధించిన ఓ మంచి విషయాన్ని మీతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నారు. తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. పక్కన అమ్మాయి అబ్బాయి ఫొటోని యాడ్ చేశాడు విశ్వక్ సేన్. తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఇందులో పెద్ద ట్వీస్టే ఇచ్చాడు. అసలు అమ్మాయి ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. కానీ అసలు విషయాన్ని సస్పెన్స్ లో పెట్టి త్వరలో డిటేయిల్స్ వెల్లడిస్తానని చెప్పడం గమనార్హం. 

Advertisement

దీంతో అభిమానులు విశ్వక్ సేన్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినీ అని ఆరా తీస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అభినందనలు తెలియజేస్తున్నారు. విశ్వక్ సేక్ కి పెళ్లి కళ వచ్చిందని కొంత మంది పేర్కొంటే.. మరికొందరూ అమ్మాయి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.  ఇదిలా ఉంటే.. విశ్వక్ సేన్ హీరోయిన్ నివేతా పేతురాజ్ తో ప్రేమలో ఉన్నారని గత కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు కూడా చేశారు. పాగల్, ఇటీవల దాస్ కా ధమ్కీ వంటి సినిమాల్లో వీరు కలిసి నటించారు. నివేతా ప్రస్తుతం కొత్త సినిమాలేవి చేయడం లేదు. విశ్వక్ సేన్ ఓ ఇంటి వాడిని కాబోతున్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడంతో విశ్వక్ సేన్ చేసుకోబోయేది ఆమెనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయి ఆమెనా ? లేక వేరే అమ్మాయా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ విశ్వక్ సేన్ పెళ్లి కబురుతో ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలో మరో పెళ్లిసందడి ఉండబోతుందన్నమాట. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

23 ఏళ్ల ‘ఖుషి’ కాంబినేషన్ మరోసారి రిపీట్..!

పుష్పరాజ్ ఖాతాలో మరో సంచలన రికార్డు.. ఎవ్వరికీ సాధ్యం కానిది..!

శ్రీలీల ఖాతాలో ఆ హ్యాట్రిక్ కాంబినేషన్ మూవీ.. హిట్ పడ్డట్టేనా ?

Visitors Are Also Reading