Home » పుష్పరాజ్ ఖాతాలో మరో సంచలన రికార్డు.. ఎవ్వరికీ సాధ్యం కానిది..!

పుష్పరాజ్ ఖాతాలో మరో సంచలన రికార్డు.. ఎవ్వరికీ సాధ్యం కానిది..!

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైనటువంటి అల్లు అర్జున్, అగ్ర దర్శకుల్లో మరొకరు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ పుష్ప ది రైజ్. ఈ సినిమాకి కంటిన్యూగా పుష్ప ది రూల్ మూవీ రానుంది. అయితే మూవీ ఇండియా మోస్ట్ యాన్టిస్పెటేడ్ గా సంచలన రికార్డులను సొంతం చేసుకుంది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ గురించి ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే విషయాన్ని పుష్ప సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డ్ లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Advertisement

మైత్రి మూవీస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇంస్టాగ్రామ్ లో 7 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇంతవరకు రిలీజ్ అయిన ఏ ఇండియన్ సినిమా పోస్టర్ కు పుష్ప 2 పోస్టర్ కు వచ్చినన్ని లైక్స్ రాలేదు. దాంతో 7 మిలియన్ లైక్స్ మార్క్ ను టచ్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప ది రూల్ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందే ఇలా  సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంటే.. విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందననే ఆసక్తి అందరిలో మొదలైంది. 

Advertisement

అల్లు అర్జున్, రష్మిక మందన్నా,  ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ప్రధాన తారాగాణంగా  తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో రిలీజ్ అవుతున్నట్టు సమాచారం అందుతుంది. పుష్ప సినిమాపై ఉన్నభారీ అంచనాలను దృష్టిలో పెట్టుకొని ఎంత ఆలస్యమైనా సినిమా బెస్ట్ అవుట్ ఫుట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి డైరెక్టర్ సుకుమార్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ ఎప్పుడు పూర్తి వుతుంది..? ఎప్పుడు విడుదలవుతుంది.?  ఎప్పుడు వీక్షించాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

జగదేక వీరుడు అతిలోక సుందరి బడ్జెట్ రూ.8 కోట్లు.. వచ్చింది ఎంతో తెలుసా ?

శ్రీలీల ఖాతాలో ఆ హ్యాట్రిక్ కాంబినేషన్ మూవీ.. హిట్ పడ్డట్టేనా ?

Visitors Are Also Reading