Home » శ్రీలీల ఖాతాలో ఆ హ్యాట్రిక్ కాంబినేషన్ మూవీ.. హిట్ పడ్డట్టేనా ?

శ్రీలీల ఖాతాలో ఆ హ్యాట్రిక్ కాంబినేషన్ మూవీ.. హిట్ పడ్డట్టేనా ?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతి తక్కువ సమయంలో చాలా పాపులారిటీని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీలీల జోరు ఇప్పట్లో తగ్గేలా  కనిపించడం లేదు.  స్టార్ హీరోయిన్స్ సైతం స్టన్ అయ్యే విధంగా వరుస సినిమాలతో దూసుకుపోతూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. చిన్న, పెద్ద హీరోల సినిమాలు అనే తేడా లేకుండా ఈ హీరోయిన్ కు  ఆఫర్స్ ఎక్కువగానే  వస్తున్నాయి.  ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చేసే బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ.

Advertisement

రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా రాబోతున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్  ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈగల్, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ.. ఇక ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే సినిమాలో సెప్టెంబర్ నుంచి జాయిన్ అవ్వనున్నట్టు  టాక్ వినిపిస్తోంది. 

Advertisement

గతంలో రవితేజ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. క్రాక్ హిట్ తరువాత  ప్రస్తుతం వీరి కాంబోలో రాబోతున్న సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రవితేజతో ఇటీవలే ధమాకా సినిమాలో నటించి మెప్పించిన శ్రీలీల మరోసారి ఆయనతో కలిసి స్టెప్స్ వేయడానికి రెడీ అయింది. థమన్ మ్యూజిక్ అందించనున్న  ఈ సినిమాకు ఇటీవలే రిలీజ్ అయిన జైలర్ సినిమాకు కెమెరా మెన్ గా పనిచేసిన విజయ్ కార్తీక్ కన్నన్ డీఓపీగా వర్క్ చేయనున్నాడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

టాలీవుడ్ స్టార్ హీరో కోసం తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి…!

Hansika : పబ్ కి తీసుకెళ్లి..బన్నీ బలవంతంగా నాతో ఆ పని చేయించాడు..!

జగదేక వీరుడు అతిలోక సుందరి బడ్జెట్ రూ.8 కోట్లు.. వచ్చింది ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading