Home » 23 ఏళ్ల ‘ఖుషి’ కాంబినేషన్ మరోసారి రిపీట్..!

23 ఏళ్ల ‘ఖుషి’ కాంబినేషన్ మరోసారి రిపీట్..!

by Anji
Ad

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా కొంతమంది హీరో, హీరోయిన్ల హిట్ ఫెయిర్ ఉంటాయి. ముఖ్యంగా ఆ హీరో, హీరోయిన్లకు అభిమానులు ఎంతగానో కనెక్ట్ అవుతారు. వారి కాంబినేషన్ లో  సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తుంటారు. ఆ విధంగానే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, హీరోయిన్ జ్యోతిక హిట్ ఫెయిర్ గా పేరు సంపాదించుకున్న జంటలో ఒకరు. వీరి కాంబో ఇండస్ట్రీలో మళ్ళీ రిపీట్ అవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.  ఆ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవలే వారిసు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో మూవీలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే..విజయ్ దళపతి తన 68వ సినిమాలో హీరోయిన్ జ్యోతికతో కలిసి నటిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ కలిసి 2000 సంవత్సరంలో వచ్చిన ఖుషి చిత్రంలో నటించారు. అప్పట్లో ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి  పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సంచలన విజయాన్ని అందుకుంది. రెండింటిలో దర్శకుడు ఎస్.జే.సూర్య ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు.  అప్పట్లో హిట్ ఫెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, జ్యోతిక కాంబినేషన్ 23 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అవుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ముఖ్యంగా జ్యోతిక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు విజయ్ దళపతితో కలిసి ఓ మూవీలో నటిస్తుందనే వార్త వినిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని జ్యోతిక మళ్లీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు.. విజయ్ లియో మూవీలో  త్రిష  హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరిదీ కూడా హిట్ కాంబినేషన్ కావడం విశేషం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

పుష్పరాజ్ ఖాతాలో మరో సంచలన రికార్డు.. ఎవ్వరికీ సాధ్యం కానిది..!

భోళా శంకర్ అట్టర్ ఫ్లాఫ్.. భారత్‌దే వరల్డ్ కప్.. ఇదే సెంటిమెంట్..!

Visitors Are Also Reading