Home » పుజారాల ఆడేవాడు పంత్ మాదిరి ఆడాడు..!

పుజారాల ఆడేవాడు పంత్ మాదిరి ఆడాడు..!

by Azhar
Ad
భారత సీనియర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే టెస్టులను అలా నెమ్మదిగా కాకుండా ఇలా వేగవంతంగా కూడా ఆడవచ్చు అని ప్రపంచానికి చూపించింది సెహ్వాగ్. మనం సెహ్వాగ్ బ్యాటింగ్ అనేది చూస్తుంటే.. అది టెస్ట్ లేక టీ20 అనేది అర్ధం కాకుండానే ఉంటుంది. ఫార్మటు ఏదైనా సరే బ్యాట్ ను ఝళిపించడం ఒక్కేటే సెహ్వాగ్ కు తెలుసు. ఇక ఇప్పటి క్రికెటర్లు ఎక్కువగా సెహ్వాగ్ చూపించిన దారిలోనే వెళ్ళుతున్నారు. టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెహ్వాగ్ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. అందుకే ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టులో 111  బంతుల్లో 146 పరుగులు చేసాడు.
అయితే గత ఏడాది కరోనా కారణం వాయిదా పడి ఇప్పుడు జరుగుతున్న ఈ టెస్ట్ లో ఓ ఘటన జరిగింది. ప్రపంచం మొత్తం అది గమనించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు వేగంగా ఉండే సెహ్వాగ్ కూడా ఆ ఘటన పై స్పందిస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసాడు. అయితే ఈ మ్యాచ్ లో త్వరగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను బెయిర్ స్టో ఆదుకున్నాడు. 140 బంతుల్లో 106 పరుగులు చేసాడు. కానీ బెయిర్ స్టో సెంచరీ చేయడానికి కారణం కోహ్లీ అని అనుటున అభిమానులకు తన మద్దతు కూడా పలికాడు సెహ్వాగ్. ఈ మ్యాచ్ లో వికెట్లు కోల్పోయి మెల్లిగా ఆడుతున్న బెయిర్ స్టోను కోహ్లీ రెచ్చగొట్టాడు.
అతడిని స్లెడ్జ్ చేస్తూ.. వాగ్వాదానికి దిగాడు. దాంతో బ్యాటింగ్ లో ఊపు పెంచిన బెయిర్ స్టో సెంచరీ చేసాడు. ఇదే విషయాన్ని సెహ్వాగ్ చెబుతూ… కోహ్లీ బెయిర్ స్టోను స్లెడ్జ్ చేయకముందు అతని స్ట్రైక్ రేట్ అనేది 21. కానీ కోహ్లీ స్లెడ్జ్ చేసిన తర్వాత అతని స్ట్రైక్ రేట్ అనేది 150. అప్పటివరకు పుజారాల ఆడిన వాడు.. తర్వాత పంత్ మాదిరి బ్యాటింగ్ చేసాడు అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు సెహ్వాగ్. అయితే సెహ్వాగ్ ఈ ట్విట్ చేయడానికి ముందునుండే ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తూ వస్తున్నారు. మరి చూడాలి ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది చివరకు ఎలా ఉంటుంది అనేది.

Advertisement

Visitors Are Also Reading