Home » కోహ్లీ వల్లే బెయిర్‌స్టో సెంచరీ చేశాడా…?

కోహ్లీ వల్లే బెయిర్‌స్టో సెంచరీ చేశాడా…?

by Azhar
Ad

ఇండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు 416 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. ఇక ఆ తర్వాత నిన్న బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక ఈరోజు మ్యాచ్ ప్రారంభమైన తర్వాత క్రీజులోకి వచ్చిన బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ వికెట్స్ పడకూడదు అని నెమ్మదిగా ఆడటం ప్రారంభించారు. ఇక అదే సమయంలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ – బెయిర్‌స్టో మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. బ్యాటింగ్ లో బెయిర్‌స్టో కొంత తడబడుతుండటంతో కోహ్లీ నవ్వుకున్నాడు.

Advertisement

ఇక ఇది చూసిన బెయిర్‌స్టో కోహ్లీకి కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి విషయాల్లో ఆశల్లే వెన్నకి తగ్గని కోహ్లీ తిరిగి బెయిర్‌స్టో కు బదులిచ్చాడు. దాంతో వాగ్వాదం అనేది ఎక్కువైంది. ఇక మధ్యలో అంపైర్లు వచ్చి అప్పటి మందం గొడవను ఆపారు. కానీ ఈ వాగ్వాదం అనేది ఓవర్ మొత్తం కొనసాగింది. మధ్యలో కోహ్లీ… బెయిర్‌స్టో బంతిని మినహా అన్ని చూస్తున్నాడు అని కామెంట్స్ చేసాడు. అది స్టాంప్ మైక్ లో రికార్డు అయ్యింది. ఇక ఆ ఓవర్ తర్వాత స్టోక్స్ ఈ విషయంలో ఇద్దరికి సద్ది చెప్పి ఆ వాగ్వాదని అక్కడితో ముగించాడు.

Advertisement

అయితే కోహ్లీతో గొడవ ముందు వరకు తన వికెట్ కాపాడుకోవాలి అన్న ఉద్దేశ్యంలో ఆడిన బెయిర్‌స్టో.. ఆ వాగ్వాదం తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చాడు. భారత బౌలర్లపై విచుకపడ్డాడు. ఈ క్రమంలోనే టెస్టులో తన 11వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అందువల్ల నెమ్మదిగా ఆడుతున్న బెయిర్‌స్టోను రెచ్చగొట్టి కోహ్లీనే అతడు సెంచరీ చేసేలా చేసాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మనం గతంలో కోహ్లీ కూడా ఇలానే బ్యాటింగ్ లో ఎవరితోనైనా గొడవ అయితే ఆ తర్వాత తన అటాకింగ్ అనేది మొదటు పెడతాడు. ఇప్పుడు అదే తరహాలో కోహ్లీ చేసిన పనివల్ల బెయిర్‌స్టో శాతం చేసాడు అంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి :

నా చెత్త రికార్డ్ బ్రేక్ అయ్యింది అని ఏడుస్తున్న బౌలర్..!

పంత్ వల్ల కాదు.. మొత్తం ఇంగ్లాండ్ బౌలర్లదే…!

Visitors Are Also Reading