Home » కోహ్లీ ఆదాయం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

కోహ్లీ ఆదాయం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియా ఖాతాలోని ఫాలోవర్ల సంఖ్యను చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. పాకిస్తాన్ లో సైతం కింగ్ కోహ్లీకి అభిమానులు ఉండటం విశేషం. అతని ఫిట్ నెస్ తో పాటు బాలీవుడ్ హీరోను తలపించే లుక్ కి ఫ్యాన్స్ ఉన్నారు. మైదానంలో పరుగుల రారాజుగా ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే విరాట్ కోహ్లీ సంపాదనలో అదురగొడుతున్నాడు.

Advertisement

తాజాగా కోహ్లీకి సంపాదనకు సంబంధించిన వివరాలను ఓ మ్యాగజైన్ తన కవర్ పేజీ మీద ప్రచురించింది.  ఈ మ్యాగజైన్ లెక్కల ప్రకారం.. విరాట్ కోహ్లీ నికర ఆదాయం రూ.1050 కోట్లు. దేశంలోనే అత్యంత రిచెస్ట్ సెలబ్రిటీగా కోహ్లీ నిలిచాడని ఆ మ్యాగజైన్ పేర్కొనడం విశేషం. కోహ్లీ సంపాదనలో ప్రధానంగా సొంత వ్యాపార పెట్టుబడులు, ప్రచారకార్యకర్తగా  చేసుకున్న ఒప్పందాల నుంచి వస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో ఓ వ్యాపార ప్రకటను షేర్ చేసేందుకు విరాట్ కోహ్లీ రూ.8.9కోట్లు చార్జ్ చేస్తున్నాడు. ట్విట్టర్ లో అయితే రూ.2.5కోట్లు తీసుకుంటున్నాడు. కోహ్లీ ప్రాపర్టీస్ విలువ రూ.110 కోట్లుండగా.. కార్స్ విలువ రూ.31 కోట్లు ఉంది. ముంబైలో రూ.34కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గామ్ లో రూ.80కోట్ల విలువ చేసిన ఇల్లు ఉంది. ఆడి, ఫార్చూనర్, రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. క్రికెట్ పరంగా.. బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్న కోహ్లీ.. మ్యాచ్ ఫీజుల రూపంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కి రూ.15లక్షలు, వన్డేకు రూ.6లక్షలు టీ20 మ్యాచ్ కి రూ.3లక్షలు తీసుకుంటున్నాడు.

Advertisement

టెస్ట్ మ్యాచ్ కి రూ.15లక్షలు. వన్డే కు రూ.6లక్షలు, టీ 20 మ్యాచ్ కి రూ.3లక్షలు తీసుకుంటున్నాడు కోహ్లీ. ఐపీఎల్ లో ఆర్సీబీ నుంచి రూ.15కోట్ల వార్షిక బ్లూ ట్రైబ్ వంటి కంపెనీలలో విరాట్ కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు. వ్యాపార ప్రకటనల ద్వారా రోజు రూ.7.5 నుంచి రూ.10కోట్లు వసూలు చేస్తున్నాడు. వివో, మింత్రా,గ్రేట్ లర్నింగ్, నాయిస్, వ్రాగన్, బ్లూస్టార్, టూయమ్మీ, ఓలిని, లక్సర్ హెచ్ఎస్ బీసీ, ఊబర్, టూత్సీ, స్టార్ స్పోర్ట్స్, అమెరికన్ టూరిస్టర్, ఎంఆర్ఎఫ్, సింథాల్ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. కోహ్లీకి రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఫుట్ బాల్ క్లబ్, టెన్నిస్ టీమ్, ప్రో రెజ్లింగ్ లీగ్ లలో కూడా కోహ్లీ భాగస్వామిగా కొనసాగుతున్నాడు. సతీమణి అనుష్క శర్మతో కలిసి కోహ్లీ SEVVA అనే ఎన్జీవోను కూడా నడిపిస్తున్నాడు. కోహ్లీ పౌండేషన్ పేరిట పేద విద్యార్థులు, క్రికెటర్లకు స్కాలర్ షిప్ కూడా అందజేస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చంద్రబాబు పై కోపంతోనే రాయుడు వైసీపీలో చేరాడా ? కారణం ఏంటంటే ?

కోహ్లీకి ఉన్న ఆ డిజార్డర్ గురించి తెలుసా? అసలు విషయం బయటపెట్టిన MSK ప్రసాద్!

Visitors Are Also Reading