Home » కోహ్లీ పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందా.. ఆఖరికి..?

కోహ్లీ పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందా.. ఆఖరికి..?

by Azhar
Ad

విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు లేదు అనే పరిస్థితి నుండి విరాట్ ఉంటె టీం ఇండియా లేదు అనేలా ఇప్పుడు పరిస్థితి అనేది వచ్చింది. అయితే ఒక్కటి కాదు.. రెండు కాదు విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కోల్పోయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుండి విరాట్ అంతర్జాతీయ క్రికెట్ లో తన సెంచరీ అనేది చేయలేదు. అందువల్ల విరాట్ పైన వరుస విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు.. విరాట్ తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో అయితే పూర్తిగా తేలిపోయాడు. అలాగే వెంస్టిండీస్ టూర్ నుండి కూడా విశ్రాంతి తీసుకున్నాడు.

Advertisement

అందువల్ల పరుగులు చేయలేక.. విశ్రాంతి అనేది తీసుకోవడంతో కోహ్లీపై చర్చ అనేది ఎక్కువైంది. అయితే ఇప్పుడు విండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. అక్కడ వన్డే మరియు టీ20 సిరీస్ అనేది ఆడనుంది. అయితే ఈ పర్యటన అనేది వచ్చే నెల 7న ముగుస్తుంది. కానీ ఆ తర్వాత భారత జట్టు అనేది మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్తుంది. కానీ ఈ పర్యటనకు బీసీసీఐ మన బి జట్టును పంపనున్నాట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. ఈ జింబాబ్వే పర్యటన ఆగస్టు 20న ముగిస్తే.. 23న ఆసియా కప్ టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడాలి. అందుకే జింబాబ్వే కు బి జట్టును పంపనుంది.

Advertisement

కానీ ఈ జింబాబ్వే పర్యటనలో బి జట్టుతో పాటుగా విరాట్ కోహ్లీ కూడా వెళ్లనున్నట్లు ఓ బీసీసీఐ సెలక్టర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు విరాట్ తీసుకున్న విశ్రాంతి వల్ల అతనికి హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ ఇలా విశ్రాంతి తీసుకొని నేరుగా.. ఏదైనా టోర్నీకి వెళ్లి ఆడటం అనేది సమస్యగా మారుతుంది. అందుకే విరాట్ ను ఆసియా కప్ కంటే ముందుగా.. జింబాబ్వే పర్యటనకు పంపాలని భావిస్తున్నాము. ఎందుకంటే.. అక్కడ ఆడితే కోహ్లీకి కొంత కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అని ఆ సదరు బీసీసీఐ సెలక్టర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

దక్షిణాఫ్రికా లీగ్ లో కూడా మన ఐపీఎల్ జట్లే హావ…!

కోహ్లీ నాతో 20 నిముషాలు మాట్లాడు..!

Visitors Are Also Reading