Home » దక్షిణాఫ్రికా లీగ్ లో కూడా మన ఐపీఎల్ జట్లే హావ…!

దక్షిణాఫ్రికా లీగ్ లో కూడా మన ఐపీఎల్ జట్లే హావ…!

by Azhar
Ad

2006లో మొదటిసారి టీ20 క్రికెట్ అనేది ప్రారంభించింది ఐసీసీ. ఆ తర్వాత 2007 లో ఈ టీ20 ప్రపంచ కప్ కు పెద్దగా ఆసక్తి అనేది చూపించలేదు. కానీ ఇప్పుడు ఈ క్రికెట్ ప్రపంచాన్ని.. ఈ టీ20 క్రికెట్ అనేదే ఏలుతుంది అనే విషయం తెలిసిందే. అయితే రాబోయే రోజులో టీ20 క్రికెట్ కు ఆదరణ పెరుగుతుంది అని అప్పుడే పసిగట్టిన మన బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే టోర్నీని ప్రారంభించింది. ఇది క్రిసీజెస్ ప్రపంచంలోనే మొదటి లీగ్ క్రికెట్. అయితే ఈ లీగ్ కు మొదటి ఏడాది నుండి ఆదరణ అనేది ఎక్కువగా దక్కింది. ఇక మన ఐపీఎల్ కు వచ్చే ఆదరణ, లాభం చూసి ఇప్పటికే చాలా దేశాల బోర్డులు తమ తమ లీగ్ క్రికెట్ ప్రారంభించాయి.

Advertisement

కానీ మన ఐపీఎల్ కు వచ్చిన ఆదరణ అనేది ఏ లీగ్ కు రాలేదు. ఈ ఐపీఎల్ వల్లే మన బీసీసీఐ ప్రపంచంలోని అన్ని బోర్డులకంటే ధనిక బోర్డుగా మారింది. అయితే ఇప్పుడు ఇదే ఐపీఎల్ తరహాలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కూడా కొత్తగా తమ లీగ్ క్రికెట్ అనేది ప్రారంభించబోతుంది. ఈ లీగ్ వచ్చేఏడాది జనవరిలో ప్రారంభం అవుతుంది. ఇక ఈ లీగ్ కోసం ఏకంగా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ లో భాగంగా జరిగే వన్డే సిరీస్ ను కూడా ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా క్యాన్సిల్ చేసుకుంది. అయితే ఆరు జట్లతో ప్రారంభం కానున్న ఈ లీగ్ కు తాజాగా గ్రేమ్ స్మిత్ కమిషనర్‌గా నియమితుడు అయ్యాడు.

Advertisement

అయితే ఇప్పుడు ఈ లీగ్ గురించి వివరాలు అవుతున్న విషయం ఏమిటంటే.. ఇందులో పాల్గొనబోయే ఆరు జట్లను మన ఐపీఎల్ యొక్క జట్ల ఓనర్లే కొనేసినట్లు తెలుస్తుంది. ఇక అక్కడ సిటీ పేర్లతో ఈ జట్లు ఉంటాయి. అందులో కే‌ప్‌టౌన్ జట్టు అనే జట్టును ముంబై ఇండియన్స్… జోహన్నెస్ బర్గ్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్…. డర్బన్ అనే జట్టును లక్నో సూపర్ జెయింట్స్… పోర్ట్ ఎలిజబెత్ అనే జట్టును సన్ రైజర్స్ హైదరాబాద్… ప్రిటోరియా జట్టును ఢిల్లీ క్యాపిటల్స్.. ఇక చివరగా పారల్ అనే జట్టును రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇందుకు సంబంధించిన ఆధికారిక ప్రకటన అనేది మాత్రం రాలేదు.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ బేసిక్స్ నుండి కోహ్లీ.. చిన్ననాటి కోచ్ అకాడమీకి పయనం…!

ధోని అభిమానిని కానీ.. ఇండియాకు కాదు అంటున్న పాక్ ప్లేయర్..!

Visitors Are Also Reading