Home » తమన్నా ప్రేమ గురించి విజయ్ వర్మ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్..!

తమన్నా ప్రేమ గురించి విజయ్ వర్మ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి లవ్ స్టోరీస్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్ లో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమల పడటంతోనే వీరు *మాంటిక్ సన్నివేశాలలో నటించే సందడి చేశారు. ఈ సిరీస్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం వీరి ప్రేమ విషయాన్ని బహిరంగంగా అందరికీ తెలియజేయడం జరిగింది.

Advertisement

పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నటువంటి ఈ జంట గురించి తరుచూ ఏదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా విజయ్ వర్మ తమన్నాతో ప్రేమ గురించి పలు విషయాలను తెలియజేశారు. తమన్నతో తాను ప్రేమలో ఉన్న తరువాత అందరి మాదిరిగానే మా జంటకు కూడా ఇంత పాపులారిటీ ఉందని తాను అసలు అనుకోలేదని తెలిపారు. ప్రేక్షకాదరణ మాపై ఉండటం నిజంగా సంతోషించదగ్గ విషయం అని ఈయన తెలియజేశారు. తామిద్దరం ప్రేమలో ఉన్నప్పుడు బయటికి వెళ్లగా అందరి దృష్టి మాపైనే పడేదని తెలిపారు. 

Advertisement

manam News

ఇలా తాను, తమన్నా బయటికి వెళ్లిన సమయంలో ప్రతీసారి మమ్మల్ని పాయింట్ అవుట్ చేసేవారు. ఇక ఆ సమయంలో తనకు చాలా అసౌకర్యంగా అనిపించేదని.. తెలియజేశారు విజయ్ వర్మ. అయితే తాను కూడా ఇలాంటి వాటిని అలవాటు పడుతున్నాను అంటూ విజయ్ వర్మ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమన్నా ప్రేమ వ్యవహారం ఇలా కొనసాగిందా అని నెటిజన్లు చర్చించుకోవడం విశేషం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 బాలకృష్ణని దర్శకుడు అనిల్ రావిపూడి అంతలా మార్చేశాడా ?

సినిమా షూటింగ్ సమయంలో క్లాప్స్ ఎందుకు కొడతారో తెలుసా ?

 

Visitors Are Also Reading