Telugu News » Blog » సీక్వెల్ కు సిద్ధమవుతున్న లైగర్…?

సీక్వెల్ కు సిద్ధమవుతున్న లైగర్…?

by Manohar Reddy Mano

ప్రస్తుతం మన తెలుగు సినిమాలు ఎక్కువగా హిట్ అయిన తర్వాత సీక్వెల్ అంటూ వచేస్తున్నాయి. గతంలో ఈ సీక్వెల్ ట్రెండ్ లేకున్నా.. బాహుబలి సినిమా రెండు భాధలుగా వచ్చిన తర్వాత ఆ ట్రెండ్ అనేది మొదలయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను అయిన సీక్వెల్ ఉంది అనే విధంగా ఎండ్ చేస్తున్నారు. ఆ సినిమా హిట్ అయితే సీక్వెల్ తీయడం.. లేదంటే లేదు అనే మైండ్ సెట్ లో ఉంటున్నారు దర్శకనిర్మాతలు.

Ads

అయితే తెలుగులో చేసిన కొన్ని సినిమాల తోనే సూపర్ హీరోగా గుర్తింపు అనేది తెచ్చుకున్నా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ అనేది ఎక్కువ ఉంది. ఇక దానిని దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ నెల 25న విడుదల కాబోతున్న ఈ సినిమాకు విపరీతమైన ప్రమోషన్ ముఖ్యంగా నార్త్ లో ఎక్కువగా చేస్తుంది చిత్ర యూనిట్.

Ads

అందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ లైగర్ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడాడు. అయితే ఈ సినిమా సీక్వెల్ వస్తుంది అని పక్కాగా చెప్పలేదు కానీ.. సీక్వెల్ కథ అనేది దఃర్శకుడు పూరి మైండ్ లో ఉంది అని చెప్పాడు. దాంతో ఈ సినిమా హిట్ అయితే తప్పవుకుండా లైగర్ 2 వస్తుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లోనే జన గణ మన సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ బ్యాట్ పట్టనున్న గౌతమ్ గంభీర్..!

కోహ్లీ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన అతని మేనేజర్..!