Home » ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. వెడ్డింగ్ ప్లాన్ గురించి చెప్పేసిన విజయ్ దేవరకొండ..!

ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. వెడ్డింగ్ ప్లాన్ గురించి చెప్పేసిన విజయ్ దేవరకొండ..!

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్న  ఈ రౌడీబాయ్ ని పెళ్లి కొడుకు గా చూడాలని అతని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవలే ఓ అమ్మాయి చేతిని పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే లైగర్ బాయ్ పెళ్లి ముచ్చట ఏమైనా చెబుతాడనుకున్నారు. చాలా మంది. అదేమీ లేదని తేలిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ 01న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Advertisement

శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్రమోషన్ లో పాల్గొన్న విజయ్ తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తన పెళ్లి.. అలాగే కాబోయే భార్యలో ఉండే లక్షణాల గురించి పలు విషయాలను చెప్పుకొచ్చాడు. “ నన్ను కేరింగ్ గా చూసుకునే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటాను. ఒక్కోసారి నేను వర్క్ లో పడి తినడం వంటి బేసిక్ థింగ్స్ కూడా మరిచిపోతాను. నన్ను వర్క్ నుంచి బయటికీ తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ గురించి గుర్తు చేసే భార్య రావాలి’ అని తన లైఫ్ పార్ట్ నర్ గురించి చెప్పుకొచ్చాడు విజయ్. ఇక పెళ్లి ఎప్పడు చేసుకుంటారని అడిగితే.. ఇప్పుడు నా గురించి మా అమ్మ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఏడాది వచ్చే ఏడాది అంటూ పెళ్లికి డేట్, టైమ్ ఏది ఫిక్స్ చేసుకోలేదు. 

Advertisement

పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే తప్పకుండా చేసుకుంటా.. అయితే ఎలాంటి హంగామా, హడావుడి లేకుండా నా పెళ్లి జరగాలన్నది నా కోరిక. అలాగా అని ఎవ్వరికీ తెలియకుండా ఆ విషయాన్ని దాచలేను అని పేర్కొన్నాడు విజయ్. ఖుషి మూవీ విషయానికొస్తే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నెని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమాలో విజయ్, సమంతలతో పాటు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్, జయరాం, సచిన్ కేడ్కర్, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి కీలక పాత్రలు పోషించారు.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 ఆ సినిమా నుంచి కీరవాణి ని ఎందుకు తొలగించారు ? కీరవాణి స్థానంలో ఎవరినీ తీసుకున్నారో తెలుసా ?

‘నా హీరోయిన్.. నా ఇష్టం’.. ఆ డైరెక్టర్ మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

Visitors Are Also Reading