Home » నా భార్యను క్షమించమన్నా.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

నా భార్యను క్షమించమన్నా.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

by Sravya
Ad

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇతర పార్టీల నేతలు పవన్ పెళ్లిళ్ల గురించి పవన్ భార్యల గురించి విమర్శలు చేస్తున్నారు. నా భార్యను నేను క్షమించమని అడిగానని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. నా భార్య అన్నా లెజినోవాని విదేశీ అని, ఆమెకు రాజకీయాలు తెలియవని పవన్ కళ్యాణ్ చెప్పారు.

pawan-kalyan-and-Third-wife-anna

pawan-kalyan-and-Third-wife-anna

నేను ధర్మం కోసం నిలబడితే చివరకు నా భార్య ని కూడా తిట్టారని అన్నారు. మన దేశ రాజకీయాలు నా భార్యకి అర్థం కావని ఎందుకు కుటుంబ సభ్యులను సైతం తిడతారని నా భార్య నన్ను అడిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కుటుంబ సభ్యుల్ని తిట్టడం వలన నా భార్య ఎంతో బాధపడిందని ఆయన అన్నారు. ఆమెని అలా అనడంతో నేను నా భార్యను క్షమాపణలు కోరానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Advertisement

Also read:

Advertisement

Also read:

ఐదు కోట్ల మంది ప్రజల కొరకు మన ఫ్యామిలీ బలైన పర్వాలేదు అని నేను నా భార్యతో చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకోపక్క మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది పిఠాపురంలో గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నారు. గెలుస్తానని పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. క్లింకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందని ఈ నేపథ్యంలో పవన్ ఎమ్మెల్యే కావడం ఖాయం అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు కలిసి వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading