Home » సమంతతో ప్రేమలో పడిపోయానంటున్న విజయ్ దేవరకొండ

సమంతతో ప్రేమలో పడిపోయానంటున్న విజయ్ దేవరకొండ

by Anji
Ad

స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. 2010లో మొదటి సారి యే మాయ చేసావే అనే సినిమాతో హీరోయిన్ గా అరగేట్రం చేసిన సామ్.. కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం సౌత్ లోనే ఫేమస్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన సత్తా చూపించడానికి సిద్ధమవుతుంది. ఇది ఇలా ఉండగా.. సమంత ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ లలో యశోద ఒకటి.

Also Read :  ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ డైరెక్టర్.. ఆహాలో అద్భుతమైన కామెడీ షో

Advertisement

manam

హరి, హరిష్ దర్శకత్వంలో సన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా యశోద తెరకెక్కుతుంది. ఈ చిత్రం వచ్చే నెల 11వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. తెలుగు వర్షెన్ ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడదలు చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో సమంతపై ఉన్న అభిమానాన్ని విజయ్ చాటుకున్నాడు.

Advertisement

Also Read :  సన్నీలియోన్ అలా మారడం వెనుక అసలు స్టోరీ ఏంటో మీకు తెలుసా..?

manam

”సమంతతో నేను ప్రేమలో పడ్డాను. నేను కాలేజీలో చదువుతున్న సమయంలోనే సామ్ ను వెండితెరపై చూశాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనను నేను అభిమానిస్తాను. ఈ రోజు సమంత నటిస్తున్న యశోద ట్రైలర్ ను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది” అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. అలాగే యశోద టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ న‌వంబ‌ర్‌ 11న విడుదల కాబోయే సినిమాపై అంచనాలను భారీగా పెంచేలా క‌నిపిస్తోంది. సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి మ‌రి.

Also Read : జగన్ ప్రోత్సాహంతోనే వర్మ ‘వ్యూహం’ చిత్రమా ?

 

Visitors Are Also Reading