Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » జగన్ ప్రోత్సాహంతోనే వర్మ ‘వ్యూహం’ చిత్రమా ?

జగన్ ప్రోత్సాహంతోనే వర్మ ‘వ్యూహం’ చిత్రమా ?

by Anji
Ads

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. సీఎంను కలిసిన తర్వాత వర్మ మీడియా సమావేశం నిర్వహించకుండానే వెళ్ళిపోయారు. దీంతో రకరకాల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా జగన్ బయోపిక్ అని, పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు సంబంధించిన స్టోరీ తో సినిమా తీస్తున్నారని రూమర్స్ వినిపించాయి. అన్నింటికీ చెక్ పెడుతూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో తాను తీయబోయే సినిమా గురించి ప్రకటించారు.

Advertisement

Ad

ప్రకటించిన చిత్రంపై ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యూహం అనే రాజకీయ సినిమాను త్వరలో తీయనున్నట్టు ప్రకటించారు.వర్మ చేసిన ట్వీట్ పరిశీలించినట్లయితే.. “నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది.

Also Read : ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ డైరెక్టర్.. ఆహాలో అద్భుతమైన కామెడీ షో

Advertisement

RamGopal Varma

RamGopal Varma

రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం”, 2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది. వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు” అంటూ వర్మ వరస ట్వీట్స్ చేసాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ తో ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఎదుర్కొనేందుకు సీఎం జగన్ ప్రోత్సాహంతోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయిస్తున్నాడా అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏది ఏమైనా కొద్దీ రోజులు ఎదురు చూస్తే ఫుల్ క్లారిటీ రానుంది.

Also Read :  ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌పోర్ట్ చేస్తూ శ్రీరెడ్డి వీడియో…భార్యాపిల్ల‌ల జోలికి వ‌స్తే నరుకుతా అంటూ వార్నింగ్..!

 

Visitors Are Also Reading