Home » మహేష్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన వేణు..!

మహేష్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన వేణు..!

by Azhar
Ad

తొట్టెంపూడి వేణు.. ఈ పేరు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే 1999వ సంవత్సరంలోనే స్వయంవరం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొట్టెంపూడి వేణు… ఆ తర్వాత హీరోగా చాల సినిమాలే చేసాడు. అందులో తక్కువ హిట్ కాగా.. ఎక్కువ ప్లాప్ గా మిగిపోయాయి. ఆ కారణంగా మల్టి స్టారర్ గా కూడా కొన్ని సినిమాలు చేసి ప్రయత్నించాడు. కానీ పెద్దగా ఫలితం లేదు.

Advertisement

అందువల్ల ఉన్నట్టుండి సినిమాల నుండి మాయం అయ్యిపోయాడు తొట్టెంపూడి వేణు. ఆయా ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇన్ని రోజులు చాలా మందికి తెలియదు. కానీ ఈ మధ్యే తాజాగా రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కనిపించి అభిమానులను అలరించాడు. అలా తొట్టెంపూడి వేణు తన సెకండ్ ఇన్నింగ్స్ అనేది ప్రారంభించాడు. కానీ ఈ సినిమా అనేది పెద్దగా సక్సెస్ కాలేదు.

Advertisement

అయినా కూడా ఈ సినిమా తొట్టెంపూడి వేణుకి బాగానే కలిసి వచ్చింది. ఆయనకు ఇప్పుడు మళ్ళీ సినిమా అవకాశాలు అనేవి పెరిగినట్లు తెలుస్తుంది. ఇప్పడు తాజాగా ఆయనకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు, త్రివికర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తొట్టెంపూడి వేణుకి.. మహేష్ బాబు అన్న పాత్రలో నటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం. అయితే త్రివిక్రమ్ అప్పట్లో తొట్టెంపూడి వేణు నటించిన చాలా సినిమాలకు మాటలు అందించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ కవర్ డ్రైవ్ బాగోదట..!

ఇండియా ఐసీసీ టైటిల్స్ ఎందుకు గెలవడం లేదో తెలుసా..?

Visitors Are Also Reading