Home » పవన్ కళ్యాణ్ మళ్లీ విడాకులు తీసుకుంటాడు.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

పవన్ కళ్యాణ్ మళ్లీ విడాకులు తీసుకుంటాడు.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

by Anji
Ad

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటారు. అయితే ఆయన చెప్పిన జాతకాలలో కొన్ని మాత్రమే నిజమయ్యాయి. గతంలో సమంత నాగచైతన్య పెళ్లి చేసినప్పుడు వారు త్వరలోనే విడిపోబోతున్నారు అని వేణు స్వామి కామెంట్ చేశారు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆయన అన్నట్టుగానే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి చెప్పినవి జరుగుతున్నాయని కొందరు ఆయనను ఫాలో అయ్యేవారు. అయితే ఇటీవల ఆయన చెప్పిన జాతకాలు బెలిసి కొట్టాయి. ప్రభాస్ కెరియర్ అయిపోయిందని అన్నారు కానీ సలార్ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ గెలుస్తారని చెప్పారు.


అదికూడా బెడిసి కొట్టడంతో సోషల్ మీడియాలో వేణు స్వామిని జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు. అయినా కూడా వేణు స్వామి వాటన్నింటిని కవర్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటారని వేణు స్వామి అన్నారు. 2024 లో పవన్ కళ్యాణ్ మరోసారి కాంట్రవర్సీ పాలు అవుతారని చెప్పుకొచ్చారు. అతడికి సినిమా పరంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా కాంట్రవర్సీలు జరగబోతున్నాయని, వాటన్నింటినీ ఆయన ఎదుర్కోక తప్పదు అంటూ వివరించారు. వాస్తవానికి ఆయనకు చెప్పే మగాడు లేకే రాజకీయాలు చేస్తూ అనవసరంగా పేరు నాశనం చేసుకుంటున్నారు అని అన్నారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలనుకునే వాళ్ళలో తాను కూడా ఉన్నానని, ఆ విషయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అర్థం కాక అనవసరంగా తనపై ట్రోల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

Advertisement

venuswamy

అయితే 2024 జులై తర్వాత పవన్ కళ్యాణ్ మూడోసారి విడాకులు తీసుకునే అవకాశం ఉందని వేణు స్వామి వెల్లడించారు. ఎన్నికలు అయిపోగానే మూడో భార్య అన్నా లెజ్నివాకు ఆయన దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప పవన్ కళ్యాణ్ కు చెప్పే వాడే లేదని కానీ ఆయన పర్సనల్ విషయాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోరని వేణు స్వామి వివరించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించి ఏం చేస్తే తాను సీఎం అవుతాడో అర్థం చేసుకోవాలని అన్నారు. ఆయన సినిమాలన్నీ కచ్చితంగా సూపర్ హిట్ అవుతాయని వెల్లడించారు. ఇక ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వేణు స్వామి చెప్పినట్టుగా నిజంగానే పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుంటాడా అనేది చూడాలి. అది కనుక తప్పయితే వేణు స్వామికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో మూడిందే.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading