Home » బ‌ల‌గం సినిమా డైరెక్ట‌ర్ వేణుకు దిల్ రాజు కారుతో పాటూ అన్ని కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చాడా..?

బ‌ల‌గం సినిమా డైరెక్ట‌ర్ వేణుకు దిల్ రాజు కారుతో పాటూ అన్ని కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చాడా..?

by AJAY
Ad

ఈ మ‌ధ్య కాలంలో జ‌నాలు థియేట‌ర్ ల‌కు వెళ్ల‌డం త‌గ్గించారు. ఏ సినిమా వ‌చ్చినా ఓటిటి లోనే చూస్తున్నారు. కానీ ఒక్క సినిమా ప్రేక్ష‌కుల‌ను సింగిల్ గా కాకుండా ఏకంగా ఫ్యామిలీతో వ‌చ్చి థియేట‌ర్ లో సినిమా చూసేలా చేసింది ఆ సినిమానే బ‌లగం. ఈ సినిమాకు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా విడుద‌లయ్యే వ‌ర‌కూ అస‌లు వేణు ఓ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడ‌ని కూడా ఎవ్వ‌రికీ తెలియ‌దు. కానీ సినిమా విడుద‌లైన త‌ర‌వాత అవుట్ పుట్ చూసి అంతా అవాక్క‌య్యారు.

ALSO READ :నిహారిక, చైతన్య మధ్య చిచ్చు పెట్టింది అతనేనా..?

Advertisement

వేణు లో ఇంత టాలెంట్ ఉందా అని అనుకున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి హీరోగా నటించ‌గా హీరోయిన్ గా కావ్య క‌ల్యాణ్ రామ్ న‌టించారు. అయితే ఈ సినిమాలో కేవ‌లం హీరో హీరోయిన్ ల‌కు మాత్ర‌మే కాకుండా న‌టించి ప్ర‌తిఒక్క‌రికీ ఇంపార్టెన్స్ ఉండ‌టం విశేషం. అంతే కాకుండా ప్రతి ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల‌ను న్యాయం చేయ‌డంతో ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమాను దిల్ రాజు సొంత బ్యాన‌ర్ లో నిర్మించిన సంగ‌తి తెలిసిందే. క‌థ న‌చ్చ‌డంతో దిల్ రాజు వేణు పై పూర్తి న‌మ్మ‌కంతో సినిమాను నిర్మించారు. ఇదిలా ఉంటే కేవ‌లం రూ.5 నుండి 6 కోట్ల బ‌డ్జెట్ తో తీసిన ఈ సినిమాకు కాసుల వర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్టు టాక్ ఉంది.

దాంతో ద‌ర్శ‌కుడు వేణుకు దిల్ రాజు రెమ్యున‌రేష‌న్ కూడా గ‌ట్టిగానే ఇచ్చార‌ని టాక్ వినిపించింది. అంతే కాకుండా ఆడి లేదా రేంజ్ రోవ‌ర్ కారు సైతం గిఫ్ట్ గా ఇచ్చార‌ని నెట్టింట గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యం పై వేణు స్పందించాడు. రెమ్యున‌రేష‌న్ విష‌యం చెప్ప‌కూడ‌దని అది ప్రోటో కాల్ అని అన్నారు. ఒక‌వేళ కార్ ఇస్తే మీకు చూపిస్తానంటూ ఆన్స‌ర్ ఇచ్చాడు. ఇక అన్నింటి కంటే కోట్ల విలువ చేసే ఆయ‌న ప్రేమ త‌న పై చూపించార‌ని సంతోషం వ్య‌క్తం చేశాడు.

ALSO READ :ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మ‌ల్లారెడ్డికి బంప‌రాఫ‌ర్..కానీ ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

Visitors Are Also Reading