Home » ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మ‌ల్లారెడ్డికి బంప‌రాఫ‌ర్..కానీ ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మ‌ల్లారెడ్డికి బంప‌రాఫ‌ర్..కానీ ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

by AJAY
Ad

సోష‌ల్ మీడియా వ‌ల్ల చాలా మంది సెల‌బ్రెటీలు అయిపోతున్నారు. ఒక‌ప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కేవ‌లం సినిమాలు టీవీనే కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియాతో బోలెడు ఎంట‌ర్టైన్మెంట్ దొరుకుతుంది. చాలా మంది త‌మ మాట‌ల ద్వారా చేత‌ల ద్వారా సోష‌ల్ మీడియా స్టార్స్ అవుతున్నారు. అలా స్టార్ అయ్యిన రాజ‌కీయ‌నాయ‌కుడు మ‌ల్లారెడ్డి. ఒక‌ప్పుడు మ‌ల్లారెడ్డి అంటే ఎవ్వ‌రికీ తెలియ‌దు.

ALSO READ :Brahmamgari Kalagnanam : శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం 2023 నుంచి 2060 వరకు జరిగేది ఏంటో తెలుసా ?

Advertisement

కేవ‌లం ఇంజనీరింగ్ కాలేజీ విద్యాసంస్థ‌ల య‌జ‌మాని మాత్ర‌మే. ఆ త‌ర‌వాత పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే విద్యాసంస్థ‌ల య‌జమానిగా పొలిటీషియ‌న్ గా రాని క్రేజ్ సోష‌ల్ మీడియా ద్వారా సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు మ‌ల్లారెడ్డి అంటే తెలియని వారు ఉండ‌రు. ఇక ఇప్పుడు సోష‌ల్ మీడియాలో క్రేజ్ వ‌చ్చిందంటే చాలు సినిమా ఆఫ‌ర్ లు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి.

Advertisement

సోష‌ల్ మీడియాలో కాస్త పాపులారిటీ వ‌చ్చిందంటే టీవీ లో సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. ఇక మ‌ల్లారెడ్డికి సైతం స్టార్ హీరో సినిమాలో అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌ల్లారెడ్డి వెల్ల‌డించారు. ఓ మీటింగ్ లో మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో విల‌న్ గా న‌టించే ఛాన్స్ వ‌చ్చింద‌ని చెప్పారు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న‌ను సంప్రదిచాడ‌ని కానీ రిజెక్ట్ చేశాన‌ని అన్నాడు.

గంట పాటూ హరీష్ శంక‌ర్ త‌న‌ను సినిమాలో న‌టించాల‌ని కోరాడ‌ని తెలిపారు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోనే హ‌రీశ్ శంక‌ర్ మ‌ల్లారెడ్డికి ఆఫ‌ర్ ఇచ్చి ఉంటారు. ఇక ఈ వార్త తెలిసిన నెటిజ‌న్ లు నువ్వు విల‌న్ కంటే కమెడియ‌న్ గా న‌వ్వించ‌గ‌ల‌వు…క‌మెడియ‌న్ గా ట్రై చేయు అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ALSO READ : RC15 : రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదే..!

Visitors Are Also Reading