Home » సీఎం, కాబోయే సీఎం లను ఓడించిన ఈ ఒకే ఒక్క వీరుడు ఎవరో తెలుసా?

సీఎం, కాబోయే సీఎం లను ఓడించిన ఈ ఒకే ఒక్క వీరుడు ఎవరో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చాలానే వార్తలు ఈ విషయం గురించి వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం కామారెడ్డిలో ఎన్నికలకు ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. అయితే.. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు? అన్న విషయమై చాలానే చర్చలు జరిగాయి. అయితే.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరమణారెడ్డి విజయం సాధించారు.

Advertisement

అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరూ కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో హైప్ ఎక్కువ అయ్యింది. మీడియా కూడా వీరిద్దరి మధ్యే ఫోకస్ చేసింది. కానీ, అక్కడి స్థానికుడైన వెంకటరమణారెడ్డిని మాత్రం పట్టించుకోలేదు. కామారెడ్డిలో తానె గెలుస్తాను అని వెంకటరమణారెడ్డి ముందు కూడా చాలా సార్లు చెప్పారు. కానీ, ఎవరు పట్టించుకోలేదు. పోలింగ్ ఫలితాల్లో వెంకటరమణారెడ్డి కేసీఆర్ పై ఏకంగా ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Advertisement

వాస్తవంలోకి వస్తే.. కామారెడ్డి బిజెపి స్థానం. బాజిరెడ్డి గోవర్ధన్ కోరడంతోనే కేసీఆర్ అక్కడ నుంచి పోటీ చేసారు. ఇది కాకుండా గజ్వేల్ లో కూడా పోటీ చేసారు. ప్రతిపక్ష పార్టీలను ఓడించి.. తన సత్తా చాటాలని అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆలోచనతో రంగంలోకి దిగారు. కానీ, వీరిద్దరూ వ్యక్తిగత విమర్శలతోనే సరిపెట్టారు. కామారెడ్డి టౌన్ అభివృద్ధి కోసం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. కానీ, దీన్ని అక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి వెంకటరెడ్డి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంకి వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడారు. ఆ మాస్టర్ ప్లాన్ కోసం బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అమలు చేసే ప్రయత్నాలు చేస్తుందని రైతులకు చెబుతూ గట్టిగానే అడ్డుకున్నారు. అక్కడి ప్రజలు, రైతులు కూడా వెంకట రమణ రెడ్డికి మద్దతు ఇచ్చారు. ఫలితంగా విజయం ఆయన్ని వరించింది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading